Share News

పోస్టల్‌ ద్వారా ఆధార్‌ సేవలు

ABN , Publish Date - Apr 10 , 2024 | 11:56 PM

పోస్టల్‌ కార్యాలయం ద్వారా ఆధార్‌ సేవలు ప్రజలకు అందు బాటులో ఉంటాయని, ఆధా ర్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ సూప రింటెండెంట్‌ ఎ.హరిబాబు అన్నారు.

పోస్టల్‌ ద్వారా ఆధార్‌ సేవలు

ఇచ్ఛాపురం: పోస్టల్‌ కార్యాలయం ద్వారా ఆధార్‌ సేవలు ప్రజలకు అందు బాటులో ఉంటాయని, ఆధా ర్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ సూప రింటెండెంట్‌ ఎ.హరిబాబు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఇచ్ఛాపురం పోస్టల్‌ కార్యాలయాన్ని ఆయన సం దర్శించి రికార్డులు పరిశీలిం చారు. ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారో అధికారులను అడిగి తెలుసు కున్నారు. ప్రజలకు విస్తృతంగా సేవలు అందించాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి 12గంటల వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 గం టల వరకు విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు పోస్టల్‌ ద్వారా మరింతగా సేవలు అందించేందుకు సేవింగ్‌ అకౌంట్‌ కౌంటర్‌ మరొకటి అదనంగా ఏర్పాటు చేశామని, దీంతో పాటు ఆధార్‌ సెంటర్‌ సేవలు కూడా ప్రారంభించామని తెలిపారు. కొత్త ఆధార్‌ కార్డులతో పాటు పాత ఆధార్‌ కార్డుల్లో చేర్పులు మార్పులుకు అవకాశం ఉందన్నారు. కొత్త ఆధార్‌కు రూ100, పాత కార్డులో చేర్పులు మార్పులకు ఒకదానికి రూ.50, అంతకంటే ఎక్కువ మార్పులకు రూ.100 చెల్లించాలని తెలిపారు. పోస్టల్‌ ఖాతాదారుల రద్దీ పెరగడంతో ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా అదనంగా మరో సేవింగ్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశా మన్నారు. పోస్టల్‌ ద్వారా అందిస్తున్న ఇన్సూరెన్స్‌ సేవలను కూడా ప్రజలు వినియో గించుకోవాలన్నారు. పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2024 | 11:56 PM