తాడేపల్లి ప్యాలెస్.. కల్కి కాంప్లెక్స్
ABN , Publish Date - Aug 04 , 2024 | 05:53 AM
‘తాడేపల్లి కల్కి కాంప్లెక్స్’ నుంచే అరాచకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. జగన్ తాడేపల్లి ప్యాలె్‌సను ఆయన కల్కి కాంప్లెక్స్‌గా అభివర్ణించి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన రాజధాని వెంకటపాలెంలో గల వేంకటేశ్వర స్వామివారిని
అక్కడి నుంచే అరాచకాలు
వైసీపీ హయాంలో లక్ష కోట్ల మద్యం కుంభకోణం
ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం: మాజీ మంత్రి డొక్కా
తుళ్లూరు, ఆగస్టు 3: ‘తాడేపల్లి కల్కి కాంప్లెక్స్’ నుంచే అరాచకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. జగన్ తాడేపల్లి ప్యాలె్‌సను ఆయన కల్కి కాంప్లెక్స్‌గా అభివర్ణించి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన రాజధాని వెంకటపాలెంలో గల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కల్కి కాంప్లెక్స్ కమాండర్ ప్రభుత్వ మాజీ ముఖ్యసలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయన్నారు. రౌడీ డాన్‌లకు కావాల్సిన ఆర్థిక వనరులను అక్కడి నుంచే అందజేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని ఇటీవల తాడేపల్లి కాం ప్లక్స్‌లో రౌడీ డాన్‌లతో సమావేశం అయ్యారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతుల వార్షిక కౌలు ఐదు సంవత్సరాలు పెంచడం హర్షణీయమన్నారు. న్యాయ చరిత్రలో ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మక విషయమని డొక్కా అన్నారు. మందకృష్ణ ఉద్యమం ఇప్పటికి ఫలించిందని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు ఎస్సీ కేటగిరీస్ యాక్ట్ తీసుకొచ్చారని, దానివల్లే సుప్రీం కోర్టులో వర్గీకరణ సాధ్యమైందని, దీనికి చంద్రబాబుకు తన ప్రత్యేక కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాం లో లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దాన్ని రికవరీ చేసి, జే బ్రాడ్స్ తాగి నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.