ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Budda Venkanna: కొడాలినాని పిచ్చికుక్క.. గుడివాడకు రేబీస్ ఇంజెక్షన్లు.. బుద్దా వెంకన్న సెటైర్

ABN, Publish Date - Jan 10 , 2024 | 12:26 PM

Andhrapradesh: మాజీ మంత్రి కొడాని నానిపై టీడీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలని చాలా సార్లు చెప్పానన్నారు.

విజయవాడ, జనవరి 10: మాజీ మంత్రి కొడాని నానిపై (Former Minister Kodali Nani) టీడీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలని చాలా సార్లు చెప్పానన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారని తెలిపారు.

దీంతో ఊరంతా తిరుగుతానని కొడాలి నాని అంటున్నారని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నట్లు ఎద్దేవా చేశారు. తన సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నట్లు తెలిపారు. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నట్లు చెప్పారు. చంద్రబాబును తిడితే కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పోయ్యిలో పెడతానని హెచ్చరించారు. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు టీడీపీ నేత విజ్ఞప్తి చేశారు.


అదంతా అభూతకల్పనే...

మరోవైపు కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ తనవి, చంద్రబాబువి అని తెలిపారు. కనకదుర్గ ఫ్లైఓవర్ తామే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే... అదంతా అభూతకల్పన అని చెప్పుకొచ్చారు. మరో నలుగురైదుగురికి రేబీస్ ఇంజెక్షన్లు పంపాలన్నారు. డబ్బులు టైట్‌గా ఉన్నాయని... చూసుకుని పంపిస్తా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు. బలహీన వర్గాలు చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బస్సు యాత్రలో మొత్తం రెడ్లే ఉన్నారన్నారు. ‘‘I am BC... చంద్రబాబుకు బీసీలు కమిట్మెంట్‌గా ఉంటారు’’ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 10 , 2024 | 12:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising