TDP: అమరావతిని నాశనం చేసి.. మళ్లీ హైదరాబాద్ అంటారా?..ధూళిపాళ్ల ఫైర్
ABN , Publish Date - Feb 14 , 2024 | 12:07 PM
Andhrapradesh: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని ముక్కలు చేసే బాధ్యత వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ అప్పజెప్పారన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 14: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర (TDP Leader Dhulipalla Narendra) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని ముక్కలు చేసే బాధ్యత వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ (CM Jagan) అప్పజెప్పారన్నారు. సజ్జలకు దొంగ ఓట్లు పెంచే బాధ్యతను.. వైవీకి రాజధానుల సంఖ్యను పెంచే బాధ్యతను అప్పగించినట్టున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని (YCP) తన్ని.. తరిమేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని జగన్‌కు అర్థమైందన్నారు. అక్రమ సంపదను దాచుకోవడానికి, హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకోవడానికే ఉమ్మడి రాజధాని డిమాండ్ అని అన్నారు. రూ. 10 వేల కోట్ల మేర నిర్మాణ పనులు జరిగిన అమరావతిని నాశనం చేసి మళ్లీ హైదరాబాద్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని జగన్ అన్నారని.. ఓట్లు వేయించుకున్నారన్నారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రా..? లేక వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రా..? అంటూ ధూళిపాళ్ల నరేంద్ర విరుచుకుపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..