ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: పవన్‌ను కలిసిన టీడీపీ నేతలు.. పిఠాపురం సీటుపైనే చర్చ..!

ABN, Publish Date - Mar 24 , 2024 | 04:20 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ సీటును టీడీపీ నుంచి వర్శ ఆశించారు. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో వర్మ కొంత అసంతృప్తికి లోనయ్యారు

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ సీటును టీడీపీ నుంచి వర్మ ఆశించారు. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో వర్మ కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడటంతో.. వర్మ శాంతించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కూడా కలిసి మద్దతు పలికారు. తాజాగా మరోసారి పవన్‌ను వర్మ కలవడం చర్చనీయాంశమైంది. ఒకవేళ తాను కాకినాడ ఎంపీగా వెళ్లాల్సి వస్తే చివరి క్షణంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ఉదయ్.. పిఠాపురం నుంచి బరిలో ఉంటారని పవన్ ప్రకటించారు. ఈ క్రమంలో పవన్ పోటీ చేయని పక్షంలో ఆ సీటు తనకే ఇవ్వాలని వర్మ కోరారు. ఈ నేపథ్యంలో సీటు అంశంమే మాట్లాడటానికి పవన్‌ను కలిశారా అనే చర్చ జరుగుతోంది.

AP Politics: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తాం... మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

సీటుపైనే చర్చ..

పవన్ కళ్యాణ్ వారాహితో పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల ప్రచారానికి సంబంధించి చర్చించేందుకే వర్మ పవన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్ని సభలు ఏర్పాటు చేయాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పిఠాపురం వస్తారు. ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించి.. సమన్వయం చేసుకునేందుకే పవన్‌ను కలిసినట్లు సమాచారం. వర్మతో పాటు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు కూడా పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అయితే మర్యాదపూర్వకంగానే పవన్‌ను కలిశామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

TDP: ప్రజాగళం షెడ్యూల్ విడుదల.. 4 రోజులపాటు పర్యటనలో బిజీ కానున్న చంద్రబాబు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 04:39 PM

Advertising
Advertising