ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: గుడివాడలో ‘రా..కదలిరా’ సభకు ముమ్మర ఏర్పాట్లు

ABN, Publish Date - Jan 15 , 2024 | 03:50 PM

Andhrapradesh: గుడివాడలో చంద్రబాబు రా... కదలిరా సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కృష్ణా జిల్లా, జనవరి 15: గుడివాడలో చంద్రబాబు రా... కదలిరా సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మల్లాయపాలెంలో సభా ఏర్పాట్లను మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, గుడివాడ టీడీపీ ఇంచార్జి వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, కృష్ణా జిల్లా టీడీపీ నేతలు సోమవారం పరిశీలించారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై టీడీపీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. అన్న ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించేలా ఆయన వర్ధంతి రోజు గుడివాడ సభ జరుగుతుందని టీడీపీ నాయకత్వం చెబుతోంది.


ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గుడివాడలో జరిగే అద్భుతమైన కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో జరిగే 25 పార్లమెంట్ సభల కంటే, గుడివాడ సభను దీటుగా నిర్వహించాలని తామంతా కంకణం కట్టుకున్నామన్నారు.

వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. 27 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఈనెల 18న గుడివాడ పసుపు వర్ణంతో మెరిసిపోతుందని తెలిపారు. చంద్రబాబు సభతో గుడివాడ ప్రజల పౌరుషం, జిల్లా టీడీపీ సత్తాను చాటి చెపుతామన్నారు.

ఎమ్మెల్యే సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గుడివాడ సభ కోసం ప్రజలతో పాటు రాష్ట్ర టీడీపీ నాయకత్వం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ సభ తమకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 15 , 2024 | 04:01 PM

Advertising
Advertising