ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల కారణంగా మంచిపేరు దెబ్బతింటోంది: చంద్రబాబు

ABN, Publish Date - Aug 28 , 2024 | 03:47 PM

ఏపీ కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని మంత్రులతో అన్నారు. పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Chandrababu

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని మంత్రులతో అన్నారు. పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేవారు. ఇక మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, తమ తమ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని అన్నారు.


ప్రభుత్వంలో కీలక మైన సమాచారం బయటకు పోతోందని చంద్రబాబు అన్నారు. శ్వేత పత్రాల్లో సమాచారం, ఓటాన్ అకౌంట్ వివరాలు, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడంపై ఆయనం విస్మయం చెందారు. ప్రభుత్వ శాఖల్లో వైసీపీ వేగులు ఉన్నారన్న అంశం కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించారు. కాగా ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన ముఖ్యమని కొందరు మంత్రులు సూచించినట్టు తెలుస్తోంది.


కూటమి గెలుపు ఏపీకి ఆక్సిజన్: మంత్రి పయ్యావుల

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఏపీకి ఆక్సిజన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. కూటమి గెలుపు ఏపీకి ఆక్సిజన్ అందిస్తోందని అన్నారు. 100 రోజుల్లోగానే ఏపీకి కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని, ఐదేళ్లలో జగన్ పర్యటనలతో కలగని ప్రయోజనం.. సీఎం చంద్రబాబు చేపట్టిన 3 పర్యటనల్లో చేకూరిందని అన్నారు. పోలవరానికి నిధుల విడుదల, అమరావతికి నిధుల సహకారం వంటివి ఏపీకి ఎంతో ఉపయోగకరమైన అంశాలే అని అన్నారు. జగన్ కేసుల కోసం ఢిల్లీకి వెళ్తే.. చంద్రబాబు నిధుల కోసం ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారని పేర్కొన్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలకు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు తేడా ఏంటో ప్రజలకు అర్థమవుతోందని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 28 , 2024 | 04:04 PM

Advertising
Advertising
<