ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దివ్వల మాధురికి తిరుమల పోలీసుల నోటీసులు

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:16 AM

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సన్నిహితురాలు దివ్వల మాధురికి ఆదివారం తిరుమల పోలీసులు నోటీసులు జారీచేశారు.

టెక్కలి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సన్నిహితురాలు దివ్వల మాధురికి ఆదివారం తిరుమల పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇటీవల తిరుమల మాడవీధుల్లో మాధురి ఫోటో షూట్స్‌, రీల్స్‌ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో ఆదివారం తిరుమల వన్‌టౌన్‌ నుంచి వచ్చిన ఎస్సైలు దీపిక, రమేశ్‌బాబు.. టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్‌, మాధురి నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి నోటీసులిచ్చారు. బీఎన్‌ఎస్‌ 292, 296, 300 తదితర సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Updated Date - Oct 21 , 2024 | 03:16 AM