Share News

Tirumala TTD : శ్రీవాణి, ఎస్‌ఈడీ టికెట్ల విడుదల తేదీల మార్పు

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:01 AM

తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టు టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటా విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది.

Tirumala TTD : శ్రీవాణి, ఎస్‌ఈడీ టికెట్ల విడుదల తేదీల మార్పు

తిరుమల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టు టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటా విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పదిరోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఈ పదిరోజులకు సంబంఽధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్లను డిసెంబరు 23వ తేదీన ఉదయం 11 గంటలకు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో మార్చి నెలకు సంబంఽధించిన శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఆన్‌లైన్‌ విడుదల తేదీలను మార్చినట్టు టీటీడీ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. 25వ తేదీన ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్లను, 26వ తేదీన ఉదయం 11 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను కూడా విడుదల చేస్తారు. భక్తులు వీటిని ‘టీటీదేవస్థానమ్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చు.

Updated Date - Dec 21 , 2024 | 04:02 AM