ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Sri Barath: ఆగిన విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు..చొరవ తీసుకున్న ఎంపీ

ABN, Publish Date - Nov 28 , 2024 | 06:00 PM

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ... పలువురు బలిదానాలతో ఈ పరిశ్రమ విశాఖపట్నంలో ఏర్పాటు అయింది. అంతేకాదు.. ఉత్తరాంధ్రకే కాదు జాతి యావత్తుకు మణిహరంగా మారింది.

విశాఖపట్నం, నవంబర్ 28: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ పరిరక్షిణకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు ఎం. శ్రీభరత్ వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి‌తో ఎంపీ శ్రీభరత్ గురువారం సమావేశమై.. చర్చించారు.

Also Read: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్


పరిశ్రమలోని ఉద్యోగుల వేతనాలు సమస్యను ఈ సందర్బంగా కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ శ్రీభరత్ తీసుకు వెళ్లారు. గత రెండు నెలలుగా పరిశ్రమలోని ఉద్యోగులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి ఆయన వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. తొందర్లోనే స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కారిస్తామని ఈ సందర్బంగా ఎంపీ శ్రీభరత్‌కు మంత్రి హెచ్ డీ దేవగౌడ హామీ ఇచ్చారు.

Also Read: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం


అలాగే స్టీల్ ప్లాంట్‌కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఎంపీకి మంత్రి హామీ ఇచ్చారు. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో రెండో ఫర్నేస్ ప్రారంభించడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి హెడీ కుమారస్వామిని ఎంపీ శ్రీభరత్ అభినందించారు.

Also Read: ఆ ప్రాంతాల్లో తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ


విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ... పలువురు బలిదానాలతో ఈ పరిశ్రమ విశాఖపట్నంలో ఏర్పాటు అయింది. అంతేకాదు.. ఉత్తరాంధ్రకే కాదు జాతి యావత్తుకు మణిహరంగా మారింది. వేలాది మందికి ఉపాధి కల్పించిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో కార్మికులు, ఆ ప్రాంత ప్రజలు ఆందోళన బాట పట్టారు. విశాఖ వేదికగా ఇంతగా ఆందోళనలు, దీక్షలు, నిరసనలు, ర్యాలీలు జరుగుతున్న గత వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.

Also Read: ఆందోళన వద్దంటూ రైతులకు కీలక సూచన


గత సీఎం వైఎస్ జగన్‌ కాదు.. ఆ పార్టీ నుంచి నుంచి గెలిచిన ఎంపీలు సైతం విశాఖ ఉక్కు విక్రయాన్ని ఆపలేకపోయారు. అంతేకాదు.. విక్రాయన్ని నిరోధించేందుకు కనీస చర్యలు సైతం తీసుకోలేదు. దీంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా గమనించారు. ఆ క్రమంలో ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కూటమికి మద్దతు తెలిపాడు.


దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కోలువు తీరింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టింది. అందులోభాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల సెంటిమెంట్‌కు సంబంధించిందని.. ఈ నేపథ్యంలో దీని విక్రయాన్ని నిలుపుదల చేసి.. పరిశ్రమ మనుగడకు సొంతంగా మైన్స్ (ఘనులు) కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలువురు కీలక నేతలు.. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు కలిసి సూచించిన సంగతి తెలిసిందే. ఈ సూచనలపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఏపీ నేతలకు హామీ ఇచ్చిన విషయం విధితమే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 06:03 PM