ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

100 రోజుల ప్రణాళిక

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:40 AM

వచ్చే ఏడాది నిర్వహించనున్న పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు రోజువారీ పరీక్షలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అమలు

రోజుకు ఒక సబ్జెకులో ఒక పాఠ్యాంశంపై పరీక్ష

విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేందుకు వీలుగా ప్రక్రియ

జిల్లాలో 471 పాఠశాలలు, 32,198 మంది విద్యార్థులు

విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):

వచ్చే ఏడాది నిర్వహించనున్న పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు రోజువారీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఒక సబ్జెక్టులో ఇప్పటికే బోధించిన పాఠ్యాంశంపై 20 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో భాగంగా కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళిక రూపొందించిన విద్యాశాఖ సోమవారం నుంచి అమలుచేయనుంది.

జిల్లాలో 108 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 10,538 మంది, 363 ప్రైవేటు యాజమాన్య పాఠశాలలో 21,660 మంది మొత్తం 471 పాఠశాలల్లో 32,189 మంది పదోతరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి సిలబస్‌ మారిన నేపథ్యంలో ప్రశ్నపత్రం మార్పుచేశారు. ఈ నేపథ్యంలో పబ్లిక్‌ పరీక్షలకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నపత్రాలతో పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. సోమవారం నుంచి 100 రోజులపాటు ప్రతి రోజు ఒక సబ్జెక్టులో ఓ పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి రోజు సోమవారం తెలుగు సబ్జెక్టుపై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను జిల్లాస్థాయిలోని రిసోర్స్‌ పర్సన్లతో కూడిన సబ్జెక్టు నిపుణుల కమిటీ రూపొందించింది. ప్రతిరోజు పరీక్ష అనంతరం జవాబుపత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థుల సామర్థ్యం మదింపుచేయనున్నారు. దీనివల్ల తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందని విద్యాశాఖ భావిస్తోంది.

పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకే

వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 100 రోజుల ప్రణాళిక అమలుచేస్తున్నాం. పదోతరగతి చదివే ప్రతి విద్యార్థీ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు ఈ పరీక్షలు దోహడపడతాయి. తక్కువ సామర్థ్యం ఉన్న విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. ప్రణాళిక అమలుతోపాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం.

- ఎల్‌.చంద్రకళ, జిల్లా విద్యాశాఖాధికారి

Updated Date - Oct 21 , 2024 | 12:40 AM