Share News

బే వాచ్‌పై విచారణకు ఏపీసీజెడ్‌ఎంఏ ఆదేశం

ABN , Publish Date - Sep 29 , 2024 | 01:38 AM

తొట్లకొండలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ లీజుకు ఇచ్చిన బే వాచ్‌ రిసార్ట్‌లో కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్టు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఏసీసీజెడ్‌ఎంఏ) జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది.

బే వాచ్‌పై విచారణకు ఏపీసీజెడ్‌ఎంఏ ఆదేశం

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

తొట్లకొండలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ లీజుకు ఇచ్చిన బే వాచ్‌ రిసార్ట్‌లో కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్టు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఏసీసీజెడ్‌ఎంఏ) జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్‌ బే వాచ్‌ రిసార్ట్‌లో నిబంధనల ఉల్లంఘనపై కలెక్టర్‌ హరేంధిర్‌ ప్రసాద్‌కు ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానిపై జిల్లా పర్యాటక శాఖ అధికారిణితో విచారణ చేయించారు. ఆ నివేదిక సమర్పించడంలో జాప్యం జరగడంతో మూర్తియాదవ్‌ ఏపీసీజెడ్‌ఎంఏకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దానిని జిల్లా స్థాయి కమిటీ చైర్మన్‌ అయిన కలెక్టర్‌కు మెంబర్‌ కన్వీనర్‌ పంపించారు. దానిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

7 నుంచి 12 వరకు ఏయూకు దసరా సెలవులు

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

దసరా పండగ నేపథ్యంలో అక్టోబరు ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటిస్తున్నట్టు రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఈఎన్‌ ధనుంజయరావు తెలిపారు. వర్సిటీతోపాటు అనుబంధ కళాశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. సెలవుల అనంతరం వచ్చే నెల 14వ తేదీన వర్సిటీతోపాటు కాలేజీలు పునఃప్రారంభం అవుతాయన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 01:38 AM