ఉక్కు ఉద్యమ కార్యాచరణ
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:14 AM
విశాఖ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించబోమని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
23న ఎమ్మెల్యేలతో రౌండ్ టేబుల్ సమావేశం
24న పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకూ ర్యాలీ
28 ఉదయం 8 నుంచి 34 గంటల దీక్ష
స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరించబోమని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనలో ప్రకటించాలి
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు
ఉక్కుటౌన్‌షిప్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించబోమని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఇంటక్ కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 23న విశాఖ జిల్లాలో గల ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ పార్టీల అధ్యక్షులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. 24న పాతగాజువాక నుంచి కొత్తగాజువాక వరకూ భారీ ర్యాలీ, సమావేశం, 27న ఉత్తరాంద్ర మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక 28వ తేదీ ఉదయం ఎనిమిది నుంచి మరుసటిరోజు సాయంత్రం ఆరు గంటల వరకు (34 గంటలు) కూర్మన్నపాలెంలోని శిబిరంలో దీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె.అయోధ్యరామ్, కేఎస్‌ఎన్ రావు, వరసాల శ్రీనివాసరావు, జె.రామకృష్ణ, కారు రమణ, యు.రామస్వామి, అప్పారావు, విళ్లా రామ్మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 01:14 AM