ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జూట్‌మిల్లుల సమస్యలపై చర్చలు వాయిదా

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:04 AM

నెల్లిమర్ల జూట్‌మిల్లు ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. కార్మికుల సమస్యలపై విశాఖపట్నం జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌(జేసీఎల్‌) కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఉమ్మడి చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు.

జూట్‌మిల్లుల సమస్యలపై

చర్చలు వాయిదా

డిసెంబరు 4, 17 తేదీల్లో భేటీ ఖరారు చేస్తూ జేసీఎల్‌ ప్రకటన

నెల్లిమర్ల/ కొత్తవలస, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల జూట్‌మిల్లు ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. కార్మికుల సమస్యలపై విశాఖపట్నం జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌(జేసీఎల్‌) కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఉమ్మడి చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. యాజమాన్య ప్రతినిధులు హాజరు కాకపోవడంతో జెసీఎల్‌ ఈ చర్చలను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. మిల్లును తక్షణం తెరిపించాలని, రిటైర్డు కార్మికులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అందివ్వాలని కార్మికులు కోరుతున్న విషయం తెలిసిందే. చర్చలకు శ్రామిక సంఘం నాయకులు చిక్కాల వెంకటగోవిందరావు, బేతా అప్పారావు, సముద్రపు సత్యనారాయణ , ఇఫ్టూ నాయకులు నామాల తిరుపతిరావు, టి.అప్పారావు, గంటా పాపారావు, కాళ్ల అప్పలసూరి, సీఐటీయు నాయకుడు కిల్లంపల్లి రామారావు తదితరులు హాజరయ్యారు.

- కొత్తవలస జూట్‌మిల్లులో విధించిన అక్రమ లాకౌట్‌కు సంబంధించి డిసెంబర్‌ 4న చర్చలే చివరి చర్చలని యాజమన్యానికి జేసీఎల్‌ స్పష్టం చేసింది. మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలో నున్న ఉమాజూట్‌ మరియు ట్వైన్‌ మిల్లులో జూలై 15 నుంచి లాకౌట్‌ అమలు చేశారు. సమస్యపై చర్చించేందుకు విశాఖలోని జేసీఎల్‌ వద్ద మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. జూట్‌ మిల్లు యాజమాన్య ప్రతినిధులు సమావేశానికి రాకుండా తమకు నెల రోజులు వ్యవధి ఇస్తే కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మెయిల్‌ ద్వారా జేసీఎల్‌కు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు నిర్వహించిన చర్చలకు యాజమాన్యం గైర్హాజరైనందున నెల రోజులపాటు గడువు ఇవ్వడం కుదరదని యాజమాన్యంకు జేసీఎల్‌ స్పష్టం చేసింది. డిసెంబర్‌ 4న తప్పనిసరిగా చర్చలకు రావాలని చెప్పింది. ఈ విషయాన్ని కార్మిక సంఘం నాయకులు గణేష్‌ పండా, రాంబాబు తెలిపారు.

--------------

Updated Date - Nov 20 , 2024 | 12:04 AM