Share News

పైడిమాంబను స్మరిస్తూ నగరంలో ర్యాలీ

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:01 AM

పైడిమాంబ దీక్షదారులు బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడితో నడుస్తూ అమ్మవారి స్మరణతో హోరెత్తించారు. ఉదయం 6 గంటలకు చదురుగుడి నుంచి గంటస్తంభం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, ఎన్‌సీఎస్‌ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ రోడ్డులో వున్న వనంగుడి వరకూ పాదయాత్ర చేశారు.

పైడిమాంబను స్మరిస్తూ   నగరంలో ర్యాలీ

పైడిమాంబను స్మరిస్తూ

నగరంలో ర్యాలీ

ఇరుముడితో నడిచిన దీక్షదారులు

విజయనగరం రూరల్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ దీక్షదారులు బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడితో నడుస్తూ అమ్మవారి స్మరణతో హోరెత్తించారు. ఉదయం 6 గంటలకు చదురుగుడి నుంచి గంటస్తంభం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, ఎన్‌సీఎస్‌ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ రోడ్డులో వున్న వనంగుడి వరకూ పాదయాత్ర చేశారు. సిరిమానోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల, అర్ధమండల దీక్షలు చేసిన పైడిమాంబ దీక్షాదారులు అంతా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం దీక్షను విరమింపచేశారు. చండీహోమం, పూర్ణాహుతి అయ్యాక ఇరుముడులు పైడిమాంబకు సమర్పించి దీక్ష విరమణ చేశారు. దీక్షాదారుల సంఘం ప్రతినిధులు మహాపాత్రో, అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈ తంతు జరిగింది. ఆలయ ఈవో డీవీ ప్రసాదరావు, సూపరింటెండెంట్‌ ఏడు కొండలు, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావుతోపాటు అర్చకులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

---------

Updated Date - Oct 31 , 2024 | 12:04 AM