ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ పాపం మీదే..

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:15 AM

పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్‌ , ఎన్నారై వ్యవహారల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు.

మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌, పక్కన కలెక్టర్‌ అంబేడ్కర్‌

- వైసీపీ పాలనలోనే పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

- జలజీవన్‌ మిషన్‌ను పట్టించుకున్నారా?

- గుర్లలో డయేరియాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్‌ , ఎన్నారై వ్యవహారల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బీఆర్‌ అండ్కేర్‌తో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేసిందన్నారు. జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ‘జలజీవన్‌ మిషన్‌కు రూ.14వేల కోట్లు కేంద్రం మంజూరు చేస్తే కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. కేవలం పైపులు ఏర్పాటు చేసి బిల్లులు చేసుకున్నారు. గ్రామీణ ప్రజలకు సురక్షిత నీరు కూడా అందించలేకపోయారు. గ్రామాల్లో 80టన్నుల చెత్త పేరుకుపోయింది. పైగా చెత్త నుంచి పన్ను వసూలు చేశారు. తాగునీటి ట్యాంకర్లను కూడా శుభ్రపరచలేదు. మా ప్రభుత్వం ఇప్పుడు వాటిని శుభ్రం చేస్తోంది. ప్రజలు వ్యాధులపై భయ బ్రాంతులు చెందుతుంటే వారిని మరింత భయం గొల్పేలా మీడియా ముందు లేని పోని అబద్ధాలు చెప్పడం వైసీపీ నేతలకు తగదు. గుర్లలో డయేరియా గురించి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డయేరియాను అరికట్టడానికి ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుం టుంది. ప్రజలు భయపడవద్దు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.’ అని మంత్రి తెలిపారు.

డయేరియా తగ్గింది: కలెక్టర్‌

జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా గుర్లలో డయేరియా తగ్గిందని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. ‘వ్యాధి బయటపడిన వెంటనే యుద్ధప్రాతిపదికన వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశాం. రోజులో రెండుపూటల పారిశుధ్య పనులు చేపడుతున్నాం. ప్రతి 20 ఇళ్లకు ఒక ఏఎన్‌ఎంను ఏర్పాటు చేశాం. గ్రామంలో భూ గర్భజలాలు కేవలం 15 అడుగుల లోతులో ఉన్నాయి. దీనివల్ల భూ గర్భ జలాలు కలుషితం కావడంతో డయేరియా ప్రబలినట్లు నిర్ధారణకు వచ్చాం. మొత్తం 277 బోరు బావులను వినియోగించకుండా వాటికి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేశాం. వాటిల్లో ఇప్పటికే సూపర్‌ క్లోరినేషన్‌ చేశాం. ప్రస్తుతం చీపురుపల్లి వద్ద ఉన్న నాగావళి పథకం నుంచి గుర్లకు తాగునీటిని సరఫరా చేస్తున్నాం. గ్రామంలో సాధారణ వాతావరణం నెలకొనేవరు వైద్యసేవలు, పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగిస్తాం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల 15 గ్రామాల్లో కూడా వైద్యశిబిరాలను ఏర్పాటు చేశాం.’ అని కలెక్టర్‌ వివరించారు.

Updated Date - Oct 20 , 2024 | 12:15 AM