పని భారం తగ్గించాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:02 AM
పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులపై పనిభారం తగ్గించాలని సీఐటీయూ నాయకుడు జీవీ రమణ డిమాండ్ చేశారు.
పార్వతీపురంటౌన్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులపై పనిభారం తగ్గించాలని సీఐటీయూ నాయకుడు జీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు పనిముట్లు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. విజయవాడ వరద బాధితులకు సేవలందించిన 20మంది కార్మికులకు ఇప్పటివరకు టీఏ, డీఏలు ఇవ్వలేదన్నారు.