వర్రా పోలీస్ కస్టడీ పిటిషన్ 26కు వాయిదా
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:48 AM
వైసీపీ సోషల్ మీడియా జిల్లా సహ సమన్వయకర్త వర్రా రవీంద్రరెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పు 26వ తేదీకి వాయిదా పడింది.
కడప రూరల్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా జిల్లా సహ సమన్వయకర్త వర్రా రవీంద్రరెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పు 26వ తేదీకి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 20న కడప ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి ఉత్తర్వులకు 22వ తేదీకి వాయిదా వేశారు. అయితే శుక్రవారం జడ్జి సెలవులో ఉండడతో ఇన్‌చార్జి న్యాయాధికారి కేసును 26కు వాయిదా వేశారు. ఇదే కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సైతం 26కు వాయిదా వేశారు.
Updated Date - Nov 23 , 2024 | 04:48 AM