Share News

AP News: హవ్వా.. ఇంత ఘోరమా.. అతని భార్య ఏం చేసిందో తెలిస్తే..

ABN , Publish Date - Oct 26 , 2024 | 08:00 PM

వారిద్దరికీ కొన్నాళ్లక్రితం పెళ్లైంది. కొన్ని సంవత్సరాల పాటు వారిద్దరూ సంతోషంగా జీవనం సాగించారు. మద్యం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. మద్యానికి బానిసైన భర్త.. తన భార్యతో నిత్యం గొడవ పడేవాడు. ఇక లాభం లేదనుకున్న భార్య తన పుట్టింటికి వెళ్లింది. కానీ, అప్పుడు వీరి లైఫ్‌లో పెద్ద మలుపు చోటు చేసుకుంది. జరగరాని ఘోరం జరిగింది.

AP News: హవ్వా.. ఇంత ఘోరమా.. అతని భార్య ఏం చేసిందో తెలిస్తే..
Anantapur News

అనంతపురం, అక్టోబరు 26: వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడని భర్తను అతి కిరాతకంగా హత్య చేయించింది భార్య ప్రియుడితో కలిసి కట కటాలపాలైంది. పరిగికి చెందిన పెయింటర్ రమేష్ (40) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రమేష్ భార్య సరోజ, ఆమె ప్రియుడు చాకలి రాజు. మరొకరిని పెనుకొండ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో అరెస్టు వివరాలను డీఎస్సీ మహేశ్ శుక్రవారం వెల్లడించారు. పరిగికి చెందిన రమేష్.. అదే మండలంలోని శ్రీరంగరాజులపల్లి వాసి సరోజను వివాహం చేసుకుని, పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడన్నారు.


మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్టులో గార్మెంట్స్ ఫ్యాక్టరీకి పనికి వెళ్తుండేది. ఈ క్రమంలో బంధువైన చాకలి రాజుతో పరిచయం ఏర్పడి, వివాహేతర బంధానికి దారి తీసింది. భర్త అడ్డు తొలగించుకుంటే సంతోషంగా ఉండవచ్చని రమేష్ హత్యకు ప్రియుడితో కలిసి సరోజ పథకం రచించింది. చాకలి రాజు మేనమామ సుబ్బరాయప్ప సాయం తీసుకున్నారు. ఈనెల 19న రొద్దం మండలం ఎల్‌జిబి నగర్ వద్దకు రమేష్‌ను సుబ్బరాయప్ప తీసుకొచ్చాడు. అక్కడే ఉన్న చాకలి రాజుతో కలిసి ముగ్గురు కల్లు తాగారు. సమీపంలోని వీధుల్లోకి వెళ్లి పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో రమేష్‌ను పొడిచి, గొంతు కోశారు.


అనంతరం ద్విచక్రవాహనంలో తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ నెల 20న రమేష్ శవాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికెళ్లి పరిశీలించిన పోలీసులకు.. అతడి వద్ద పెయింటింగ్‌కు సంబంధించిన కూపన్లు లభించాయి. వాటి ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పరిగి మండలానికి చెందిన పెయింటర్‌గా గుర్తించారు. ఆ మేరకు అతడి భార్య సరోజ, ఆమె ప్రియుడు చాకలి రాజు, సుబ్బరాయప్పను ఆరెస్టు చేశారు. హత్యకు వాడిన కత్తి, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌కు ఇద్దరు కుమారులున్నట్లు డీఎస్సీ వివరించారు.


Also Read:

అన్న మోసం చేశాడు.. షర్మిల కన్నీటిపర్యంతం..

షర్మిలపై నోరుపారేసుకున్న పెద్దిరెడ్డి

కదంతొక్కిన బంగ్లా హిందువులు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 26 , 2024 | 08:00 PM