Share News

Shock: అయ్యో.. మమ్మల్ని బస్సెక్కించి.. నువ్వు పాడెక్కావా బిడ్డా..

ABN , Publish Date - Oct 15 , 2024 | 05:49 PM

గ్యారెంటీ లేనిది వ్యక్తి జీవితం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కళ్ల ముందు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వ్యక్తులు.. అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్నారు. ప్రాణాలు విడుస్తున్నారు. ఇంటి నుంచి క్షేమంగా బయలుదేరి వెళ్లిన వ్యక్తి.. మళ్లీ అంతే క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారనేది చెప్పలేం.

Shock: అయ్యో.. మమ్మల్ని బస్సెక్కించి.. నువ్వు పాడెక్కావా బిడ్డా..
Road Accident

అనంతపురం, అక్టోబర్ 15: గ్యారెంటీ లేనిది వ్యక్తి జీవితం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కళ్ల ముందు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వ్యక్తులు.. అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్నారు. ప్రాణాలు విడుస్తున్నారు. ఇంటి నుంచి క్షేమంగా బయలుదేరి వెళ్లిన వ్యక్తి.. మళ్లీ అంతే క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారనేది చెప్పలేం. మృత్యులు ఏ వైపు నుంచి ఎలా వస్తుందో.. వ్యక్తిని ఎలా బలిగొంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితే అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.


అప్పటి వరకు సంతోషంగా గడిపిని ఆ కుటుంబం.. నిమిషాల వ్యవధిలోనే విషాదంలో మునిగిపోయింది. చేతికందిన కొడుకు.. కళ్లముందే కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. లోకాన్ని చూసేందుకు సిద్ధంగా ఉన్న తన బిడ్డను చూడకుండానే ఆ తండ్రి ఈ లోకాన్ని విడిచిపోవడంతో.. అతని భార్య గుండెలవిసేలా విలపించింది. అయ్యో భాస్కరా.. మమ్మల్ని బస్సెక్కించి.. బైక్‌పై వస్తానంటూ పాడెక్కావా నాయనా.. అంటూ ఆ కుటుంబ సభ్యుల రోధనలను ఇతరులను కన్నీటిపర్యంతం చేశాయి.


అసలేం జరిగింది..

సోమవారం రాత్రి కదిరి మండలం పట్నం వద్ద జాతీయ రహదారి 42పై రోడ్డు ప్రమాదం జరిగింది. భాస్కర్(24) ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భాస్కర్ సొంతూరు పట్నం. ఉపాధి నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురంలో ఉంటున్నాడు. భాస్యర్ భార్య సీమంతం కార్యక్రమం కోసం కుటుంబమంతా పట్నం గ్రామానికి వచ్చారు. ఆదివారం ఘనంగా సీమంతం కార్యక్రమం నిర్వహించారు. మరుసటి రోజు అంటే సోమవారం తల్లిదండ్రులు, భార్యను బస్సులో అనంతపురం పంపించాడు. తాను సాయంత్రం బైక్‌పై వస్తానంటూ చెప్పి.. వారిని సాగనంపాడు.


చెప్పినట్లుగానే ఊర్లో పనులన్నీ ముగించుకుని రాత్రి సమయంలో పట్నం నుంచి అనంతపురం తన బైక్‌పై బయలుదేరాడు భాస్కర్. కానీ, విధి వంచించింది. లారీ రూపంలో మృత్యువు అతని నిండు ప్రాణాలను బలిగొంది. సరిగ్గా హంద్రీనివా కాలువ సమీపానికి రాగానే.. భాస్కర్ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాస్కర్.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు.. గండెలు పగిలేలా ఏడ్చారు. అప్పటి వరకూ సంతోషంగా ఉన్నవారంతా.. ఒక్కసారిగా తీవ్ర దుఃఖసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు.. భాస్కర్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

మీ పాదాల ఆకారం మీ గురించి చెప్పే నిజాలు..

పంజాబ్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్

గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 15 , 2024 | 05:49 PM