హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ లాభం రూ.16,821 కోట్లు
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:37 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ రూ.16,821 కోట్ల స్టాండ్ అలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన...
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ రూ.16,821 కోట్ల స్టాండ్ అలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ.15,976 కోట్ల లాభంతో పోలిస్తే 5 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.85,500 కోట్లకు చేరుకుంది. 2023-24లో ఇదే కాలానికి రెవెన్యూ రూ.78,406 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 6 శాతం వృద్ధితో రూ.17,826 కోట్లుగా నమోదైంది.
హెచ్‌డీబీ రూ.12,500 కోట్ల ఐపీఓ: హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రూ.12,500 కోట్ల ఐపీఓ ప్రతిపాదనకు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. బ్యాంక్ అనుబంధ విభాగమే ఈ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ ఐపీఓలో భాగంగా తమ వాటా నుంచి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా విక్రయించనున్నట్లు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకుతోడు రూ.2,500 కోట్ల తాజా ఈక్విటీ జారీతో కలిపి హెచ్‌డీబీ ఫైనాన్షియల్ ఐపీఓ సైజు రూ.12,500 కోట్లకు చేరుకోనుంది.
Updated Date - Oct 20 , 2024 | 12:37 AM