జీనోమ్ వ్యాలీలో ఆరిజీన్ ఫార్మా యూనిట్
ABN, Publish Date - Jun 04 , 2024 | 04:38 AM
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన బయోలాజిక్స్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా కంపెనీ అనుబంధ సంస్థ ఆరిజీన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన బయోలాజిక్స్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా కంపెనీ అనుబంధ సంస్థ ఆరిజీన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్.. హైదరాబాద్ సమీపంలోని జీనోమ్ వ్యాలీలో కొత్త బయోలాజిక్స్ యూనిట్ ప్రారంభించింది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ప్రాసెస్, అనలిటికల్ డెవల్‌పమెంట్ ల్యాబ్స్ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఉత్పత్తి యూనిట్ ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతుందని కంపెనీ తెలిపింది.
Updated Date - Jun 04 , 2024 | 04:38 AM