Stock Market: హమ్మయ్య.. లాభాల్లోకి దేశీయ సూచీలు.. వరుస నష్టాల నుంచి
ABN, Publish Date - Nov 19 , 2024 | 10:34 AM
స్టెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం, విదేశీ మదుపర్లు అమ్మకాలు దిగడంతో సూచీలు ఈ నెలలో భారీ నష్టాలను చవిచూశాయి. గరిష్టం నుంచి సెన్సెక్స్ ఏకంగా 9 వేల పాయింట్లు పడిపోయింది. దీంతో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
వరుసగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు మంగళవారం లాభాల జోష్‌తో ప్రారంభమయ్యాయి. స్టెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం, విదేశీ మదుపర్లు అమ్మకాలు దిగడంతో సూచీలు ఈ నెలలో భారీ నష్టాలను చవిచూశాయి. గరిష్టం నుంచి సెన్సెక్స్ ఏకంగా 9 వేల పాయింట్లు పడిపోయింది. దీంతో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ లాభాల్లో కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాల్లో కదలాడుతోంది (Business News).
సోమవారం ముగింపు (77, 339)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 77, 548 వద్ద మంగళవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. 78 వేల మార్క్ దాటేసింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 920 పాయింట్ల లాభంతో 78, 260 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. 281 పాయింట్ల లాభంతో 23, 734 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా కదలాడాయి. ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాలు అందుకుంటున్నాయి.
సెన్సెక్స్‌లో జీఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్, భెల్, ఫెడరల్ బ్యాంక్, ఆర్‌ఈసీ లాభాలు అందుకుంటున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్సియల్, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 974 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 526 పాయింట్ల లాభంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.40గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 19 , 2024 | 10:34 AM