TATA Group: చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్..ఇప్పటివరకూ మరే కంపెనీకీ సాధ్యం కాని ఘనత!
ABN, First Publish Date - 2024-02-06T19:58:24+05:30
భారతీయ విలువలకు, వ్యాపారదక్షతకు అసలైన ఉదాహరణగా నిలిచే టాటా గ్రూప్ మరో అద్భుతం సాధించింది. ఏకంగా 30 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన తొలి భారతీయ సంస్థగా చరిత్ర కెక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ విలువలకు, వ్యాపారదక్షతకు అసలైన ఉదాహరణగా నిలిచే టాటా గ్రూప్ (TATA Group) మరో అద్భుతం సాధించింది. ఏకంగా 30 లక్షల కోట్ల మార్కెట్ విలువను (Market Cap) దాటిన తొలి భారతీయ సంస్థగా చరిత్రకెక్కింది. టాటా గ్రూప్ సంస్థలపై టీసీఎస్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్ షేర్లపై మదుపర్ల ఆసక్తి పెరగడంతో ఫిబ్రవరి 6న తొలిసారిగా సంస్థ మార్కెట్ విలువ సరికొత్త గరిష్ఠాన్ని తాకింది (Tata Group becomes first Indian conglomerate to cross Rs 30 lakh crore market cap).
ఈ ఏడాది ఇప్పటివరకూ టాటా కన్సల్టెన్సీ సంస్థ షేర్ల విలువ 9 శాతం పెరగ్గా, టాటా మోటర్స్ షేర్లు 20 శాతం మేర లాభపడ్డాయి. టాటా పవర్ షేర్లు 18 శాతం, ఇండియన్ హోటల్స్ షేర్లు 16 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. తతిమా గ్రూప్ కంపెనీల షేర్లు సగటున 1 నుంచి 5 శాతం మధ్య లాభపడగా టాటా కెమికల్స్, టాటా ఎలెక్సీ, తేజాస్ నెట్వర్క్ షేర్లు పది శాతం మేర పడిపోయాయి.
1868లో ఓ సాధారణ ప్రైవేట్ ట్రేడింగ్ సంస్థగా టాటా గ్రూప్ ప్రస్తానం ప్రారంభమైంది. 2023లో తొలిసారిగా సంస్థ ఆదాయం 12 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌కు సంబంధించి 35 అనుబంధ సంస్థలు ఉండగా మొత్తం 1,028,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Updated Date - 2024-02-06T20:02:00+05:30 IST