గ్రాన్యూల్స్ లాభంలో మూడింతల వృద్ధి
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:41 AM
గ్రాన్యూల్స్ ఇండియా.. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.135 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గ్రాన్యూల్స్ ఇండియా.. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.135 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.48 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా మూడింతలు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ కూడా రూ.985 కోట్ల నుంచి రూ.1,180 కోట్లకు పెరిగింది. గత ఏడాది కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయని, ఈ ఏడాది వాటిని అధిగమించటంతో మెరుగైన ఫలితాలను నమోదు చేసినట్లు గ్రాన్యూల్స్ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి తెలిపారు.