Chennai: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ABN, Publish Date - Nov 21 , 2024 | 11:35 AM
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు దారుణహత్యకు గురయ్యారు. తనను పెళ్ళి చేసుకోడానికి నిరాకరించేందనే ఆగ్రహంతో ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. తరగతి గదిలో జరిగిన ఈ సంఘటన చూసి విద్యార్థులు భయంతో పరుగెత్తారు.
చెన్నై: తంజావూరు(Thanjavur) జిల్లా మల్లిపట్టినం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు దారుణహత్యకు గురయ్యారు. తనను పెళ్ళి చేసుకోడానికి నిరాకరించేందనే ఆగ్రహంతో ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. తరగతి గదిలో జరిగిన ఈ సంఘటన చూసి విద్యార్థులు భయంతో పరుగెత్తారు. మల్లిపట్టినం సమీపం చిన్నమలై ప్రాంతంలో నివసిస్తున్న రమణి (26) అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తమిళ ఉపాధ్యాయురాలి(Tamil teacher)గా పనిచేస్తున్నారు. చిన్నమలై ప్రాంతానికే చెందిన పన్నీర్‌సెల్వం కుమారుడు మదన్‌కుమార్ (30) రమణిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు.
ఈ వార్తను కూడా చదవండి: Rains: రామనాథపురంలో కుండపోత.. స్తంభించిన జనజీవనం
అంతేగాక రమణిని వివాహం చేసుకునేందుకు ఆమె పెద్దలతో మాట్లాడాలంటూ రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులను పంపించాడు. అయితే మదన్‌కుమార్‌ను పెళ్ళి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, తాను ఇప్పుడే ఉద్యోగంలో చేరానని, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసి మదన్‌కుమార్ బుధవారం ఉదయం రమణి పనిచేస్తున్న పాఠశాలకు వెళ్ళాడు. ప్లస్ వన్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న రమణి వద్దకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకునేందుకు ఎందుకు నిరాకరించావంటూ కేకలేశాడు.
వెంటనే తనతో తెచ్చిన కత్తితో ఆమెపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రమణి తరగతి గదిలో కుప్పకూలిపడింది. రక్తపుమడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రమణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సేతుబావాసత్తిరం పోలీసులు కేసు నమోదు చేసుకుని మదన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన తంజావూరు ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈపీఎస్ ఖండన...
టీచర్ దారుణహత్యకు గురికావటం పట్ల అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్, అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తరగతి గదిలో తమిళ టీచర్ దారుణహత్యకు గురికావటం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని ఈపీఎస్ తెలిపారు. ఆమె కుటుంబీకులకు పార్టీ తరఫున తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ శాంతి భద్రతలను పరిరక్షించడంపై దృష్టిసారించాలని ఈపీఎస్ సూచించారు.
విద్యామంత్రి దిగ్ర్భాంతి...
ఉపాధ్యాయురాలి హత్య పట్ల పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కత్తితో దాడిచేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రమణి మృతితో శోకతప్తులైన ఆమె కుటుంబీకులకు, విద్యార్థులకు, సహచర ఉపాధ్యాయులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలో టీచర్‌పై దాడిని ఖండించిన సీఎం స్టాలిన్, ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. అదే విధంగా మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల సాయం ప్రకటించారు.
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్ గడువు..22 వరకు ఎడిట్ ఆప్షన్
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 21 , 2024 | 11:35 AM