Today Horoscope: ఈ రాశి వారు ఉద్యోగంలో లక్ష్యాలు సాధిస్తారు
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:27 AM
రాశిఫలాలు 20-12- 2024 - శుక్రవారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
రాశిఫలాలు
20-12- 2024 - శుక్రవారం
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్, సృజనాత్మక రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఇంటికి అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఫర్నీచర్, ఇతర గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
తోబుట్టువులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. మెయిల్స్, వాట్సాప్ సందేశాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బోనస్‌లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లహాస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సమీక్షించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, క్రీడలు, విద్య, ఆడిటింగ్ రంగాల వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలపై ఒక నిర్ణయానికి వస్తారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. వీ సా, పాస్‌పోర్ట్ వ్యవహారాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం ల భిస్తుంది. యూనియన్ కార్యకలాపాలు, సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
న్యాయ, బోధన, రవాణా, రాజకీయ, సినీ రంగాలవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. వడ్డీలు చేతికి అందుతాయి. మూచ్యువల్ ఫండ్స్, డిపాజిట్లపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆస్పత్రులు, హార్డ్ వేర్ రంగాల వారికి ప ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో నిధులు సర్దుబాటు అవుతాయి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది.జనసంబంధాలు విస్తరిస్తాయి. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
హోటల్, ఆస్పత్రులు, కేటరింగ్, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Dec 20 , 2024 | 05:27 AM