Share News

Today Horoscope : ఈ రాశి వారు దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.

ABN , Publish Date - Dec 21 , 2024 | 01:48 AM

నేడు (21-12-2024-శనివారం) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారంతో వృత్తి పరమైన లక్ష్యాలు సాధిస్తారు.

Today Horoscope : ఈ రాశి వారు దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.

నేడు (21-12-2024-శనివారం) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారంతో వృత్తి పరమైన లక్ష్యాలు సాధిస్తారు.

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారంతో వృత్తి పరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగానికి చెందిన పెద్దలను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


02 Vrushabham - Taurus.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. న్యాయ, బోధన, రవాణా, ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు.


03 Mithunam - Gemini.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

గృహ నిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులకు వెచ్చిస్తారు. సంకల్పం ఫలిస్తుంది.


04 Karkatakam - Cancer.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వాములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


05 Simha - Leo.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం, చిట్‌ఫండ్‌లు, సేవల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


06 Kanya - Virgo.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వినూత్న మార్గంలో ఆలోచించి విజయం సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్‌, సినిమాలు, గ్రాఫిక్స్‌ రంగాలవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


07 Tula - libra.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విదేశీ విద్య కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


08 Vruschikam - Scorpio.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


09 Dhanassu - Sagittarius.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారంల లభిస్తుంది. ఉన్నత పదవులకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణ శుభప్రదం.


10 Makaram - Capricorn.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

మీ అంచనాలు ఫలిస్తాయి. రాజకీయాలు, ప్రచురణలు, న్యాయ, బోధన, రవాణా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.


11 Kumbham - Aquarius.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూర వుతాయి.


12 Meenam - Pisces FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మరాశిఫలాలు

Updated Date - Dec 21 , 2024 | 01:48 AM