Today Horoscope : ఈ రాశి వారికి వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి.
ABN, Publish Date - Nov 05 , 2024 | 01:20 AM
నేడు(05-11-2024-మంగళవారం) ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
నేడు(05-11-2024-మంగళవారం) ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వ్యాపార లావాదేవీల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, మ్యూచ్యువల్ పండ్స్, పెన్షన్ లావాదేవీలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సుబ్ర హ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. హోటల్, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రియతముల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వివాహాది శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విద్యా సంస్థలు, చిట్ఫండ్లు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రయాణాల్లో నిదానం అవసరం. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ శుభ ప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణాకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లలో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్ర పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. సోదరీ సోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు ఏర్పాట్లు చే సుకుంటారు. సంకల్పం సాధనకు అధికంగా శ్రమించాలి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గారాధన శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ, న్యాయ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక వ్యవహరాల్లో పెద్దల సహకారం లోపిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తవుతాయి. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఽప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధిస్తారు. పెద్దలతో చర్చల సందర్భంగా జాగ్రత్తలు పాటించాలి. దుర్గామాతను ఆరాధించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Nov 05 , 2024 | 01:20 AM