ఈ వారం వివిధ కార్యక్రమాలు 2 12 2024
ABN, Publish Date - Dec 02 , 2024 | 04:30 AM
‘అసిపె’ పరిచయ సభ, దళిత కథ 2023 ‘కొమ్ము’. కథా ఉత్సవం, తెరసం పదేళ్ళ సాహిత్య సభలు...
‘అసిపె’ పరిచయ సభ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వనపట్ల సుబ్బయ్య దీర్ఘకావ్యం ‘అసిపె’ పరిచయ సభ డిసెంబర్ 3 మధ్యాహ్నం 2గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభాద్యక్షత పి. వహీద్ ఖాన్, అతిథులు గోరటి వెంకన్న, జూలూరు గౌరిశంకర్, గుంటూరు లక్ష్మీ నరసయ్య, ఎస్. రఘు, యాకూబ్, సంగిశెట్టి శ్రీనివాస్, సీతారాం, కోట్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు. వివరాలకు: 94927 65358.
నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక
దళిత కథ 2023 ‘కొమ్ము’
జంబూ సాహితి ప్రతి ఏటా వెలువరించే కథా వార్షిక సిరీస్‌లో భాగంగా కొమ్ము దళిత కథ 2023 ఆవిష్కరణ సభ డిసెంబర్ 5న పీజీ సెమినార్ హాల్, కోఠి ఉమెన్స్ కాలేజ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త సూర్యా ధనంజయ, ముఖ్య అతిథి తిప్పర్తి యాదయ్య, గౌరవ అతిథి సతీష్ చందర్, వక్త కాశీం, అధ్యక్షత సిద్దెంకి యాదగిరి. సభలో జూలూరి గౌరీ శంకర్, కోయి కోటేశ్వర రావు, గడ్డం మోహన్ రావులు పాల్గొంటారు.
జంబూ సాహితీ
కథా ఉత్సవం
నాలుగు కథా సంకలనాల ఆవిష్కరణ ఒకేసారి జరుగు తున్నది. ‘దీపావళి ప్రత్యేక కథలు 2024’, ‘ఈ కాలపు తెలుగు కథ’, ‘ఆధునిక తెలుగు కథ’, ‘అపురూప చింతన కథలు’ – ఈ కథా సంకలనాల ఆవిష్కరణ సభ ‘కథా ఉత్సవం’ పేరుతో డిసెంబర్ 7 సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో జరుగుతుంది. వీటి సంపాదకులైన మహమ్మద్ ఖదీర్ బాబు, కుమార్ కూనపరాజు, వెంకట్ సిద్ధారెడ్డి, మహి బెజవాడ, అరిపిరాల సత్యప్రసాద్, అజయ్ ప్రసాద్ ఈ సంకలనాల లోని రచయితల కృషిని వివరిస్తారు.
కుమార్ కూనపరాజు
తెరసం పదేళ్ళ సాహిత్య సభలు
తెలంగాణ రచయితల సంఘం పదేళ్ళ సాహిత్య సభలు డిసెంబర్ 8 ఉ.10.30 నుంచి సా.7.30వరకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతాయి. ప్రారంభ సమావేశంలో నాళేశ్వరం శంకర్, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి ‘తెలంగాణ అస్తిత్వ సాహిత్యం – వర్తమాన సందర్భం’ అంశంపై సాహిత్య సదస్సు ఉంటుంది. పొట్లపల్లి శ్రీనివాస రావు, సి. కాశీం తదితరులు పాల్గొంటారు. సాయత్రం పలు పుస్తకావి ష్కరణలు, కవి సమ్మేళనం ఉంటాయి.
తెలంగాణ రచయితల సంఘం
Updated Date - Dec 02 , 2024 | 04:30 AM