Loksabha Polls: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన పంజాబ్ ఎంపీ
ABN, Publish Date - Mar 26 , 2024 | 09:42 PM
లోక్ సభ ఎన్నికల వేళ పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. లుధియానా సిట్టింగ్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014లో కూడా లుధియానా నుంచి బిట్టు పోటీ చేసి గెలుపొందారు. 2021 మార్చ్ నుంచి జూలై వరకు లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరించారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి (Congress) బిగ్ షాక్ తగిలింది. లుధియానా సిట్టింగ్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. 2014లో బిట్టు లుధియానా నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2021 మార్చ్ నుంచి జూలై వరకు లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడిగా బిట్టు వ్యవహరించారు. 2021 జనవరిలో జన్ సంసద్ కార్యక్రమంలో భాగంగా సింగు సరిహద్దులో బిట్టుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 2009లో ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బిట్టు ప్రాతినిధ్యం వహించారు. శిరోమణి అకాళిదల్ అభ్యర్థి డాక్టర్ దల్జీత్ సింగ్‌ను 67 వేల ఓట్లతో ఓడించారు.
2014లో లుధియానా నుంచి బిట్టు బరిలోకి దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన హర్విందర్ సింగ్ పుల్కాపై 19 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ సమయంలో శిరోమణి అకాళిదల్ నేత మూడో స్థానంలో నిలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో లోక్ ఇన్సాప్ పార్టీ నేత సిమర్ జీత్ సింగ్‌పై 76 వేల ఓట్ల తేడాతో బిట్టు ఘన విజయం సాధించారు. అప్పుడు శిరోమణి అకాళిదల్ నేత మహీందర్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 26 , 2024 | 09:42 PM