Dark Circles: నిద్రలేకపోవడమే కాదు.. కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి ఇవీ కారణాలే..!
ABN , Publish Date - Apr 22 , 2024 | 04:00 PM
నిద్రలేకపోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోవడం వంటి అలవాట్లు ఉన్నవారిలో డార్క్ సర్కిల్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ డార్క్ సర్కిల్స్ ఎంత అందంగా ఉన్నవారిని అయినా అందవికారంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇవి కేవలం నిద్ర లేకపోవడం వల్ల మాత్రమే కాదు. శరీరంలో కొన్ని అనారోగ్యాలు కలిగినా కూడా వస్తాయి
కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను డార్క్ సర్కిల్స్ అంటారు. చాలామంది నిద్ర లేకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయని అంటారు. నిద్రలేకపోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోవడం వంటి అలవాట్లు ఉన్నవారిలో డార్క్ సర్కిల్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ డార్క్ సర్కిల్స్ ఎంత అందంగా ఉన్నవారిని అయినా అందవికారంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇవి కేవలం నిద్ర లేకపోవడం వల్ల మాత్రమే కాదు. శరీరంలో కొన్ని అనారోగ్యాలు కలిగినా కూడా వస్తాయి. డార్క సర్కిల్స్ వెల్లడించే అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుంటే..
రక్తహీనత ..
ఐరన్ లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి , దీనిని రక్తహీనత అంటారు. ఈ కారణంగా, ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు తగినంత పరిమాణంలో చేరదు. దీని వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి.
Stress: ఒత్తిడి వేధిస్తోందా? ఈ 5 చిట్కాలతో ఈజీగా తగ్గించుకోండి..!
థైరాయిడ్..
థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగా విడుదల చేయకపోవడం వల్ల థైరాయిడ్ పనితీ దెబ్బతింటుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చు. ఇలా థైరాయిడ్ సమస్య ఏర్పడటం వల్ల కూడా కళ్ల కింద నల్లని వలయాలు వస్తాయి.
విటమిన్ లోపం..
శరీరంలో విటమిన్-బి, విటమిన్-కె, విటమిన్-ఇ, విటమిన్-డి వంటి విటమిన్లు లోపం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి . అందుకే నల్లటి వలయాలు చాలా కాలం పాటు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి విటమిన్ల లోపాన్ని చెక్ చేయించుకోవాలి.
డీహైడ్రేషన్..
ప్రతిరోజూ ఒక వ్యక్తికి 8 గ్లాసుల నీరు అవసరం. దీనికంటే తక్కువ నీరు త్రాగితే శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. ఇది కూడా నల్లటి వలయాలకు కారణమవుతుంది.
హైపర్‌పిగ్మెంటేషన్..
సన్‌స్క్రీన్ లేదా సన్ ప్రొటెక్షన్ లేకుండా సూర్యరశ్మికి ఎక్కువ సేపు బహిర్గతం కావడం వల్ల హైపర్‌పిగ్మెంటేషన్ వస్తుంది. మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఇది జరుగుతుంది.
ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!
చర్మవ్యాధులు..
చర్మవ్యాధుల వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. చర్మం పొడిబారడం, ఎరుపు, వాపు వంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా కళ్ళ దగ్గర రక్త నాళాలు వ్యాకోచించి, చర్మం పైన నల్లగా కనిపిస్తాయి.
అలెర్జీ..
కొన్నిసార్లు అలెర్జీల కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ఇతర కారణాలు..
తరచుగా కళ్ళు రుద్దడం, వయస్సు పెరగడం, అకాల వృద్ధాప్యం, ఒత్తిడి, కళ్లు లోతుగా ఉండటం, ధూమపానం మొదలైనవి కూడా నల్లటి వలయాల సమస్యకు కారణం అవుతాయి.
ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!
మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్యవార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.