Gym: పిల్లలను జిమ్ కు పంపడానికి సరైన వయస్సు ఎంత? ఫిట్నెస్ నిపుణులు ఏం చెప్తున్నారంటే..!
ABN, Publish Date - Apr 26 , 2024 | 03:00 PM
పిల్లలు కూడా జిమ్ చేయవచ్చా.. జిమ్ కు వెళ్లాలంటే పిల్లల వయసు ఎంత ఉండాలి? దీని గురించి ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారు? చిన్న వయసులోనే పిల్లలు జిమ్ కు వెళితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?
ఈరోజుల్లో జిమ్ కి వెళ్లడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు పెద్దవారు, వైద్యుల సిఫారసు ఉన్నవారు జిమ్ కు వెళ్లేవారు. కానీ ఇప్పట్లో చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు జిమ్ కు వెళుతున్నవారు ఉన్నారు. మరీ ముఖ్యంగా సినిమా హీరోల్లానూ, హీరోయిన్లలానూ శరీరాకృతి పొందడానికి జిమ్ కు వెళ్ళడం పరిపాటి అయ్యింది. అయితే పిల్లలు కూడా జిమ్ చేయవచ్చా.. జిమ్ కు వెళ్లాలంటే పిల్లల వయసు ఎంత ఉండాలి? దీని గురించి ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారు? చిన్న వయసులోనే పిల్లలు జిమ్ కు వెళితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే..
ఇప్పట్లో పిల్లలు 14 నుండి 15 సంవత్సరాల వయస్సులో జిమ్‌కు వెళ్తుండటం చూడచ్చు. చాలా మంది పిల్లలు 11-12 సంవత్సరాల వయస్సులోనే కూడా జిమ్‌కు వెళ్లాలని పట్టుబడతారు. కానీ పిల్లలను జిమ్ కు పంపడానికి సరైన వయస్సు 17-18 సంవత్సరాలని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కౌమారదశలో పిల్లల శరీరంలో మార్పులు సంభవిస్తాయి. ఈ దశలో జిమ్ కు వెళ్లడానికి వారి శరీరం అనువుగా ఉండదు. పిల్లల శరీరంలో కండరాలు, ఎముకలు జిమ్ ఒత్తిడిని భరించలేవు. అందుకే 17-18 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లలను జిమ్ కు పంపకపోవడం మంచిది.
ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారంతో నిర్మించబడిన హోటల్ .. ఇందులో అద్దె ఎంతంటే..!
జిమ్‌కి వెళ్లడం వల్ల పిల్లలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితమవుతారు. అధిక బరువు ఉన్న పిల్లలను చిన్న వయసులోనే జిమ్‌కి పంపితే వారు సన్నబడాలని ఒత్తిడికి గురవుతారు. వ్యాయామశాలలో బరువు తగ్గడానికి చాలా నెలలు పట్టవచ్చు. ఫలితాలు వెంటనే కనిపించవు. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ జిమ్‌కి వెళ్లడం, మనం ఫిట్‌గా లేమనే భావన పిల్లలపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా పిల్లలు ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలను అనుభవించవచ్చు.
చిన్న పిల్లలను జిమ్‌కి పంపే బదులు వారు బాగా ఎంజాయ్ చేయగలిగే ఫిజికల్ యాక్టివిటీస్ ను ఎంకరేజ్ చేయవచ్చు. పిల్లలు ఆటలు, స్విమ్మింగ్, యోగా, రన్నింగ్ మొదలైనవాటిని ఎంజాయ్ చేస్తూ చేయగలరు. పిల్లలపై శారీరకంగా, మానసికంగా ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా వారి వయస్సుకు తగిన కార్యకలాపాలు చేయించే ఫిట్నెస్ నిపుణులను ఎన్నుకోవడం అత్యుత్తమం.
భూమిపై ఉండే 8 అతిపెద్ద చెట్లు ఇవీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Apr 26 , 2024 | 03:00 PM