Kids Health: మీ పిల్లలు మొబైల్ ఎక్కువగా వాడుతుంటారా? జాగ్రత్త.. ఈ ముప్పు రావచ్చు..!
ABN, Publish Date - Apr 08 , 2024 | 02:06 PM
చిన్నపిల్లలు మొబైల్ ఇవ్వకపోతే ఏ పని చేయరు. కానీ మొబైల్ ఎక్కువ వాడటం వల్ల పిల్లలలో కలిగే సమస్య ఇదీ..
మొబైల్ ఫోన్ ఇప్పటి ప్రజల జీవితంలో భాగం అయిపోయింది. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా మొబైల్ ఫోన్ కు వ్యసనపరులుగా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ ఫోన్ లేకపోతే అన్నం తినరు, నిద్రపోరు, హోం వర్క్ కూడా మొబైల్ ఇస్తేనే చేస్తాం అని మొంట పట్టు పడతారు. ఏదో ఒక విధంగా పిల్లలు పనులు చేస్తున్నారు కదా అనే కారణంతో చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలు అడగగానే వారి చేతిలో మొబైల్ పెట్టేస్తుంటారు. అయితే మొబైల్ ఎక్కువ వాడుతుంటే పిల్లలలో ఆటిజం రావచ్చని వైద్యులు అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఆటిజం పూర్తి పేరు ఆటిజనం స్పెక్ట్రమ్ డిజార్ఢర్. దీన్ని వ్యాధి అనడం సబబు కాదని వైద్యుల అభిప్రాయం. ఇది పిల్లలలో మానసిక స్థితిని ప్రభావితం చేసే సమస్య. ఈ సమస్య ఉన్న పిల్లలలో మెదడు సాధారణ పిల్లల మెదడు పనితీరుకు విభిన్నంగా ఉంటుంది. విచారించాల్సిన విషయం ఏమిటంటే వివిధ పద్దతులు, మార్గాల ద్వారా, వివధ సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆటిజం ఉన్న పిల్లల జీవితాన్ని మెరుగుపరచవచ్చు కానీ పూర్తీగా ఈ సమస్యను పరిష్కరించలేరు.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో బిర్యానీ ఆకు నమలడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
తల్లిదండ్రులు పిలిచినప్పుడు పలకకపోవడం, కళ్లు ఎలాగంటే అలా తిప్పుతూ ఉండటం, భావోద్వేగాలను బయటపెట్టలేకపోవడం. తోటి పిల్లలతో ఆడుకోలేకపోవడం. చెప్పిన పని చేయలేకపోవడం, తన ఇష్టాఇష్టాలను బయటకు చెప్పలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు మొబైల్ ను ఎక్కువ ఉపయోగించడం వల్ల మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Apr 08 , 2024 | 02:06 PM