Rosemary Tea: రోజ్మేరీ టీ ఎప్పుడైనా తాగారా? రోజూ ఓ కప్పు రోజ్మేరీ టీ తాగితే కలిగే లాభాలేంటంటే..!
ABN , Publish Date - May 17 , 2024 | 11:39 AM
రోజ్మేరీని చాలామంది జుట్టు పెరుగుదల కోసం ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టు పెరుగుదలను, జుట్టుకు బలాన్ని, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకే రోజ్మేరీ నూనెను, రోజ్మేరీ సీరమ్, రోజ్మేరీ స్ప్రే మొదలైనవి జుట్టు పెరుగుదల కోసం వాడుతుంటారు. అయితే రోజ్మేరీని కేవలం సౌందర్య సాధనంగానే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడచ్చు.
రోజ్మేరీని చాలామంది జుట్టు పెరుగుదల కోసం ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టు పెరుగుదలను, జుట్టుకు బలాన్ని, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకే రోజ్మేరీ నూనెను, రోజ్మేరీ సీరమ్, రోజ్మేరీ స్ప్రే మొదలైనవి జుట్టు పెరుగుదల కోసం వాడుతుంటారు. అయితే రోజ్మేరీని కేవలం సౌందర్య సాధనంగానే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడచ్చు. రోజ్మేరీ ఆకులను బాగా ఉడికించి టీలా తాగుతుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇంతకీ రోజూ ఓ కప్పు రోజ్మేరీ టీ తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే..
రోజ్మేరీ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు అయిన రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్ చాలా శక్తి వంతమైనవి. ఇవి శరీరానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. తద్వారా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వ్యాధి ప్రమాదాలు తగ్గిస్తాయి.
అధిక రక్తపోటు గురించి చాలామందికి తెలియని నిజాలివీ..!
ఆహారం సరిగా జీర్ణం కావాలంటే జీర్ణ ఎంజైమ్ లు చాలా అవసరం. అయితే రోజ్మేరీ ఈ జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా రోజ్మేరీ టీ తీసుకుంటే అది జీర్ణక్రియకు సహాయపడుతుంది. చాలామందిలో ఎక్కువగా కనిపించే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రోజ్మేరీ టీ తాగడం వల్ల క్లియర్ అవుతాయి.
చాలామందిలో మానసిక ఏకాగ్రత లేకపోవడం, మూడీగా ఉండటం, ఏ పని మీదా ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలుంటాయి. అయితే రోజ్మేరీ టీ తాగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మానసిక ఆరోగ్యం పెరుగుతుంది.
రోజ్మేరీ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి. ఆర్థరైటిస్, కండరాల నొప్పి వంటి సమస్యలున్నవారు రోజ్మేరీ టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.
రోజ్మేరీ టీ లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలన్నా, శరీరం వివిధ వ్యాధులతో సమర్థవంతంగా పోరాడాలన్నా విటమిన్-సి అవసర. అందుకే రోజ్మేరీ టీ తాగితే రోగనిరోధక శక్తిని బలపడుతుంది.
ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!
రోజ్మేరీని సాధారణంగా ఎసెన్షియల్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ నూనె సౌందర్య ఉత్పత్తులలోనూ, అరోమా క్యాండిల్స్ లోనూ, సోపుల తయారీలోనూ ఇలా చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అదే విధంగా రోజ్మేరీ టీ వాసన కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
రోజ్మేరీ టీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరానికి ఆక్సిజన్, పోషకాలు పుష్కలంగా అందుతాయి. శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. రోజూ ఓ కప్పు రోజ్మేరీ టీ తాగితే రక్తప్రసరణను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. రేనాడ్స్ వ్యాధి లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
ఇప్పట్లో ఉబ్బసం, ఆస్తమా, అయాసం వంటి శ్వాసకోశ సమస్యలు అనుభవిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారికి రోజ్మేరీ టీ చక్కని ఉపశమనం ఉస్తుంది. రోజ్మేరీ టీ తాగితే గొంతు ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు సమయంలో ఈ టీ తాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవు.
మీకూ నాలుక తెల్లగా ఉంటుందా? దీనికి అసలు కారణాలు ఇవే..!
ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.