Share News

Health: పచ్చి కూరగాయలు తింటున్నారా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..

ABN , Publish Date - Oct 25 , 2024 | 10:47 PM

పచ్చి కూరగాయాలు తినాలా వద్దా అనేది నిర్ణయించుకునే ముందు ఈ అంశం గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వీటిని తినే విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.

Health: పచ్చి కూరగాయలు తింటున్నారా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: పచ్చి కూరగాయలను యథాతథంగా తింటే పలు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతుంటారు. ఇది వాస్తవమేనని స్వయంగా ఆయుర్వేద శాస్త్రమే చెబుతోంది. అయితే, పచ్చి కూరగాయాలు తినాలా వద్దా అనేది నిర్ణయించుకునే ముందు ఈ అంశం గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు (Health).

Viral: ఎక్కువసేపు నిలుచున్నా ప్రమాదమే! తాజా అధ్యయనంలో వెల్లడి


ఆయుర్వేదం ప్రకారం పచ్చి కూరగాయలను సాత్విక ఆహారం అంటారు. వీటితో శరీరంలో విషతుల్యాలు తొలగిపోయి నూతనోత్తేజం కలుగుతుంది. ఇక వండిన వాటిల్లో కంటే పచ్చి కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం వండే సమయంలో కొన్ని పోషకాలు నాశనమవుతాయి. పచ్చి కూరగాయలతో ఈ బెడద ఉండదు. వీటిల్లో నీటి శాతం ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. వీటిల్లో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా దీర్ఘకాలిక రోగాలు దరిచేరవు. కెలొరీలు కూడా తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి అత్యంత అనుకూలమైనవి. ఇక పచ్చికూరగాయల్లో ఉండే ఎంజైమ్‌ల కారణంగా జీర్ణక్రియ మరింత సమర్థవంతంగా జరిగి ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిల్లో అధికంగా ఉండే పీచు పదార్థంతో పేగుల్లో ఆహారం కదలికలు సులువుగా మారి, మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది. వీటితో రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుందని, ఐరోన్, కాల్షియం వంటి మినరల్స్ శరీరానికి సమృద్ధిగా అందుతాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. బీపీ, షుగర్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా అంటున్నారు.

Coconut Oil: రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!


అయితే, పచ్చి కూరగాయల విషయంలో కొంత అప్రమత్తత కూడా అవసరమనేది వైద్యులు చెప్పే మాట. ముఖ్యంగా కూరగాయల ప్యాకింగ్, రవాణాలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వీటి వల్ల బ్యాక్టీరియల్ వ్యాధులు సంక్రమించే అవకాశం మెండుగా ఉంటుందట. పచ్చికూరగాయల వల్ల వ్యాపించే ఈకొలై, సాల్మొనెల్లా వంటి సూక్ష్మక్రిములు పలు వ్యాధులు కలగజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పచ్చికూరగాయలను సరిగా కడగకుండా వినియోగిస్తే వాటిపై ఉండే పెస్టిసైడ్లు హార్మోన్ల సమౌల్యాన్ని దెబ్బతీస్తాయని, చివరకు ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, పచ్చికూరగాయలు తినాలనుకునే వారు ముందుగా వాటిని బాగా కడిగి, పెచ్చు తొలగించాలని చెబుతున్నారు. ఉప్పు, వెనిగర్ వేసిన నీళ్లల్లో కూరగాయలను కడిగితే హానికారక సూక్ష్మక్రిములు, రసాయనాలు చాలావరకూ వదిలిపోతాయని చెబుతున్నారు.

Cakes: కేక్ అంటే ఇష్టపడే వారికి నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే!

Read Health and Latest News

Updated Date - Oct 25 , 2024 | 11:00 PM