America: అమెరికాలో జోరుగా పోలింగ్!
ABN , Publish Date - Nov 06 , 2024 | 04:04 AM
ఉత్కంఠ భరితంగా మారిన అమెరికా ఎన్నికల్లో ప్రజలు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉందన్న నివేదికల నడుమ అనేక మంది ఓటర్లు ఊత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్కంఠ భరితంగా మారిన అమెరికా ఎన్నికల్లో ప్రజలు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉందన్న నివేదికల నడుమ అనేక మంది ఓటర్లు ఊత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు వరకూ వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ సుమారు 8.2 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించున్నారు. ఇక కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్‌పై ఒక శాతం ఆధిక్యతతో ఉన్నారట.
అమెరికా ఎన్నికల ఫలితాలు.. ఉద్యోగులకు సుందర్ పిచాయ్ కీలక సూచన
ఈమారు చెదుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలు చోట్ల ఓటింగ్ యంత్రాల్లో సాంకేతిక లోపాల కారణంగా పోలింగ్‌లో జాప్యం చోటుచేసుకుంది. కొన్ని చోట్ల పోలింగ్‌ను అదనంగా రెండు గంటల పాటు పొడిగించేందుకు స్థానిక న్యాయస్థానాలు అనుమతించాయి. కొలరాడో, మోంటానాల్లో హిమపాతాన్ని లెక్క చేయకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Donald Trump: అలా అయితేనే నేను ఓటమిని ఒప్పుకుంటా: డొనాల్డ్ ట్రంప్
ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ ఓటు వినియోగించుకున్నారు. మరో అభ్యర్థి కమలా హారిస్ మెయిల్ ద్వారా ముందుగానే ఓటేశారు. ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇరు నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఫలితం ఏదైనా తనకు ఆమోదయోగ్యమేనని ట్రంప్ పేర్కొన్నారు.
For International News And Telugu News