Share News

ట్రంప్‌ సంపద... రూ.56,502 కోట్లు!

ABN , Publish Date - Nov 07 , 2024 | 05:01 AM

అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాపారం రియల్‌ ఎస్టేట్‌ నుంచి మీడియా రంగం వరకూ విస్తరించింది. ఆయన నికర ఆస్తుల విలువ నవంబరు 5 నాటికి 6.7 బిలియన్‌

ట్రంప్‌ సంపద... రూ.56,502 కోట్లు!

న్యూఢిల్లీ, నవంబరు 6: అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాపారం రియల్‌ ఎస్టేట్‌ నుంచి మీడియా రంగం వరకూ విస్తరించింది. ఆయన నికర ఆస్తుల విలువ నవంబరు 5 నాటికి 6.7 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌ తెలిపింది. ఇది రూ.56,502 కోట్లతో సమానం. డీజేటీ యూఎస్‌ ఈక్విటీ కింద ట్రేడవుతున్న ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌లో ఆయనకు 57శాతం వాటా ఆయనకున్న అతిపెద్ద ఆస్తి. తన తండ్రి ఫ్రెడ్‌ ట్రంప్‌ నుంచి వారసత్వంగా చేపట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించారు. ఎన్నో విలాసవంతమైన భవనాలను నిర్మించారు. క్రిప్టో కరెన్సీ, ఎన్‌ఎ్‌ఫటీ వంటి డిజిటల్‌ ఆస్తుల్లోనూ ట్రంప్‌ పెట్టుబడులు పెట్టారు. పుణె, ముంబైలో ఇప్పటికే రెండు ట్రంప్‌ టవర్లు పూర్తయ్యాయి. కోల్‌కతా, గురుగ్రామ్‌లలోనూ రెండు టవర్లు నిర్మాణంలో ఉన్నాయి. అయితే ట్రంప్‌ టవర్‌తో పాటు ఇతర ఆస్తులు తాకట్టులో ఉన్నాయని, కోర్టు తీర్పుల తర్వాత కొత్త అప్పులు కూడా వచ్చాయని ట్రంప్‌ ఎన్నికల సమయంలో ప్రకటించారు.

Updated Date - Nov 07 , 2024 | 05:01 AM