Kamala Harris: కమలా హారిస్ ఓటమిని ఒప్పుకున్నారా.. షాకింగ్ డెసిషన్..
ABN, Publish Date - Nov 06 , 2024 | 12:21 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డోనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువవుతున్నందున కమలా హారిస్ ఎన్నికల రాత్రి ప్రసంగాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని డెమోక్రటిక్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ సెడ్రిక్ రిచ్‌మండ్ తెలిపారు.
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ఓటమిని ఒప్పుకున్నారా? అధ్యక్ష పీఠం అధిరోహించడంలో కీలకంగా వ్యవహరించే ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఆరింటిల్లోనూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌పై విజయం సాధించారు. డోనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువవుతున్నందున కమలా హారిస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల రాత్రి ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారని ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ సెడ్రిక్ రిచ్‌మండ్ వాషింగ్టన్‌లో తెలిపారు.
విజయంపై ధీమాతో..
ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని కమలా హారిస్ భావించారు. విజయంపై పూర్తి ధీమాతో ఉన్న ఆమె ముందుగానే స్పీచ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ట్రంప్ లీడ్‌లో దూసుకెళుతుండటంతో స్పీచ్‌ను రద్దు చేసుకున్నారు. కమలా హ్యారిస్ గెలుస్తుందనే నమ్మకంతో ముందుగానే వాష్టింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీకి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె ఓడిపోవడంతో కన్నీళ్లతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
ఓటమి ..
భారత, ఆఫ్రికా సంతతికి చెందిన 59 ఏళ్ల కమలా హారిస్ అమెరికా పౌరురాలు. తల్లిదండ్రులు డోనాల్ట్ J.హారిస్, తల్లి శ్యామలా గోపాలన్. శ్యామలా తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి. కమలా హారిస్ ఎక్కువగా తన తల్లి కుటుంబంతో సన్నిహితంగా పెరిగారు. పలుమార్లు తల్లితో కలిసి చైన్నై వచ్చింది. 2014లో డోగ్లాస్ ఎంహాఫ్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021 జనవరి 20న కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
Also Read:
అగ్రరాజ్యం అమెరికాను పాలించే అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా
రాత్రికి రియల్ ట్రంప్‌ను చూస్తారు.. ఎలాన్ మస్క్ సెన్సేషనల్ ట్వీట్..
అమెరికా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే 7 స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలు ఇవే
For More International News
Updated Date - Nov 06 , 2024 | 04:11 PM