శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో ఎన్‌పీపీ స్వీప్
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:16 AM
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) పార్టీ సత్తా చాటింది.
కొలంబో, నవంబరు15: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) పార్టీ సత్తా చాటింది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. అంతేకాదు చరిత్రలో తొలిసారిగా తమిళుల కంచుకోట జాఫ్నాలోనూ విజయకేతనం ఎగురవేసింది. 225 స్థానాలకు గాను ఎన్‌పీపీ కూటమికి 159 దక్కాయి. విపక్ష సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ పవర్ పార్టీ 40 సీట్లలో విజయం సాధించింది. ఈ ఏడాది సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత దిస్సనాయకే విజయం సాధించారు. ఆ తర్వాత ఆయనే పార్లమెంట్‌కు ఎన్నికలు ప్రకటించారు.
Updated Date - Nov 16 , 2024 | 04:16 AM