PM Modi: జెలెన్ స్కీకి ప్రధాని మోదీ భరోసా..
ABN, Publish Date - Aug 23 , 2024 | 05:46 PM
ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకి భారత ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై అని పెద్ద ఎత్తున నినాదించారు. 200 మంది భారతీయులను ప్రధాని మోదీ కలిశారు. తర్వాత ఫోమిన్ బొటానికల్ గార్డెన్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
ప్రధాని మోదీ (PM Modi) ఉక్రెయిన్‌లో బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకి భారత ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై అని పెద్ద ఎత్తున నినాదించారు. 200 మంది భారతీయులను ప్రధాని మోదీ కలిశారు. తర్వాత ఫోమిన్ బొటానికల్ గార్డెన్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జెలెన్ స్కీ భుజంపై మోదీ చేయి వేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోదీ- జెలెన్ స్కీ కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెండు రోజుల పోలండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ వచ్చారు.
మ్యూజియం సందర్శన
ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. రష్యాతో జరిగిన యుద్ధంలో చనిపోయిన చిన్నారుల స్మారక ప్రాంతానికి చేరకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. మృతిచెందిన చిన్నారులకు అంజలి ఘటించారు. తర్వాత మారిన్స్కీ ప్యాలెస్‌లో జెలెన్ స్కీతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి పరిష్కారంపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది.
స్పందించిన ఐక్యరాజ్యసమితి
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఈ పర్యటన శాంతి నెలకొల్పేందుకు పనిచేస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెర్రెస్ అభిప్రాయ పడ్డారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ దేశాన్ని ఏ భారతదేశ ప్రధాని సందర్శించలేదు. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడికి తెగబడ్డాయి. దాంతో ఉక్రెయిన్‌కు భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. రష్యా దాడి చేసినప్పటి నుంచి నాటో దేశాలు తప్ప, మరే దేశ అధినేత ఉక్రెయిన్ సందర్శించలేదు.
ఇవి కూడా చదవండి:
Mike Lynch: బ్రిటన్ 'బిల్ గేట్స్' సహా ఐదుగురి మృతి.. కుమార్తె కోసం కొనసాగుతున్న అన్వేషణ
High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?
Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు
Read More International News and Latest Telugu News
Updated Date - Aug 23 , 2024 | 05:57 PM