రష్యా రాకెట్‌లో ఇరాన్ శాటిలైట్లు
ABN , Publish Date - Nov 06 , 2024 | 04:09 AM
రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ రాకేట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
మాస్కో, నవంబరు 5: రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ రాకేట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా రష్యా, 53 ఇరాన్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇరాన్‌కు చెందిన కౌసర్ హోడోడ్ సహా చిన్న ఉపగ్రహాలను కూడా రష్యా ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య బంధం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు ఐనోస్పియర్‌ను పర్యవేక్షించడంతో కీలకపాత్ర పోషించనున్నాయి. నాసా ప్రకారం... అంతరిక్ష వాతావరణం సూచనలను తెలుసుకోవడానికి ఐనోస్పియర్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.