Share News

Handlova: స్లొవేకియా ప్రధానిపై కాల్పులు

ABN , Publish Date - May 16 , 2024 | 03:45 AM

స్లొవేకియా దేశ ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికోపై బుధవారం హత్యాయత్నం జరిగింది. హ్యాండ్లోవా నగరంలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని బయటికొచ్చిన అనంతరం ఆయనపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అనుకూలుడిగా పేరున్న ఫికో, గతంలో రెండు పర్యాయాలు (2006-10, 20012-18) ప్రధానిగా పనిచేశారు.

Handlova: స్లొవేకియా ప్రధానిపై కాల్పులు

విషమంగా పరిస్థితి.. నిందితుడి అరెస్ట్‌

హ్యాండ్లోవా, మే 15: స్లొవేకియా దేశ ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికోపై బుధవారం హత్యాయత్నం జరిగింది. హ్యాండ్లోవా నగరంలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని బయటికొచ్చిన అనంతరం ఆయనపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అనుకూలుడిగా పేరున్న ఫికో, గతంలో రెండు పర్యాయాలు (2006-10, 20012-18) ప్రధానిగా పనిచేశారు. గతేడాది అక్టోబర్‌లో మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పొరుగుదేశమైన ఉక్రెయిన్‌తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలుమార్లు ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించిన ఆయన, రష్యాతో రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. మీడియా చట్టం సహా పలు వివాదస్పద మార్పులు చేసిన ఫికో పై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. కాగా, ఫికోపై దాడిని ఆ దేశాధ్యక్షురాలు జుజానా క్యాపుటోవా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - May 16 , 2024 | 03:45 AM