Nobel Prize in Literature 2024: సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం
ABN, Publish Date - Oct 10 , 2024 | 05:22 PM
సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను వరించింది. మానవ జీవితంలోని దుర్బలత్వంతోపాటు చారిత్రక విషాదాలను ఆమె.. తన రచనల్లో కళ్లకు కట్టారని రాయల్ స్వీడిష్ అకాడమని గురువారం వెల్లడించింది. ఇప్పటికే వైద్య రంగం, రసాయన, భౌతిక శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను నిర్వహాకులు ప్రకటించారు.
స్వీడన్, అక్టోబర్ 10: సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను వరించింది. మానవ జీవితంలోని దుర్బలత్వంతోపాటు చారిత్రక విషాదాలను ఆమె.. తన రచనల్లో కళ్లకు కట్టారని రాయల్ స్వీడిష్ అకాడమని గురువారం వెల్లడించింది. ఇప్పటికే వైద్య రంగం, రసాయన, భౌతిక శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను నిర్వహాకులు ప్రకటించారు.
Also Read: రతన్ టాటాకి ఘోర అవమానం జరిగినా..?
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబుల్ బహుమతి ముగ్గురిని వరించింది. యూఎస్‌కు చెందిన డేవిడ్ బేకర్‌తోపాటు బ్రిటన్‌కు చెందిన డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌కు ఈ పురస్కారం దక్కింది. ప్రోటీన్ల ఆవిష్కరణలో వీరు చేసిన కృషికి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమి బుధవారం వెల్లడించింది.
Also Read: ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరంటే..?
మరోవైపు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి జాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు దక్కింది. వీరిద్దరు కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్‌ను సాధ్యం చేసేలా సిద్దాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు. దీంతో వీరిని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు.
Also Read: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్
ఇంకోవైపు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణతోపాటు జన్యు నియంత్రణలో దాని పాత్రను వీరిద్దరు వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెరికాకు చెందిన వీరిద్దరిని నోబెల్ పురస్కారాన్ని ఎంపిక చేసినట్లు నిర్వహాకులు ప్రకటించారు.
ఇక సాహిత్యంలో నోబెల్ విజేత పేరు అక్టోబర్ 14వ తేదీన నిర్వాహాాకులు ప్రకటించనున్నారు. డిసెంబర్ 10వ తేదీని స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో విజేతలకు నిర్వహాకులు ఈ పురస్కారాలను అందజేయనున్నారు.
For International News And Telugu News...
Updated Date - Oct 10 , 2024 | 05:32 PM