Trump : అవును.. ఎమర్జెన్సీ విధిస్తా
ABN , Publish Date - Nov 19 , 2024 | 02:53 AM
తాను అధికార పగ్గాలు చేపట్టాక జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తానని..
వాషింగ్టన్ డీసీ, నవంబరు 18: తాను అధికార పగ్గాలు చేపట్టాక జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తానని.. బైడెన్ హయాంలో పెద్ద ఎత్తున అక్రమంగా అమెరికాలోకి వచ్చినవారిని తిరిగి వారి వారి దేశాలకు పంపేందుకు (మాస్ డీపోర్టేషన్) సైనిక సాయాన్ని వినియోగించుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ పగ్గాలు చేపట్టగానే అమెరికాలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందంటూ వారంరోజుల క్రితం ‘జ్యుడీషియల్ వాచ్’ ప్రెసిడెంట్ టామ్ ఫిట్టన్ ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్టు పెట్టారు. దానికి ట్రంప్ సోమవారం నాడు.. ‘ట్రూ (నిజం)’ అంటూ స్పందించారు. అక్రమ వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలని భావించిన ట్రంప్.. అందుకు నిధులివ్వడానికి అమెరికా కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో, ఆ నిధుల కోసం 2019లో ఎమర్జెన్సీ విధించారు.