Donald Trump: ట్రంప్‌ను చంపేందుకు చేసిన కుట్ర బట్టబయలు.. పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు
ABN, Publish Date - Nov 09 , 2024 | 07:37 AM
అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి వేసిన ప్లాన్‌ను న్యాయ శాఖ బహిర్గతం చేసింది. ఈ ఘటన విషయంలో అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌ను (donald trump) చంపేందుకు ఇరాన్ చేసిన కుట్ర విఫలమైందని అమెరికా (america) న్యాయ శాఖ తెలిపింది. పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ వ్యక్తి ట్రంప్‌పై కాల్పులు జరపడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అప్పుడు ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఈ ఘటనలో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ (IRGC)లోని ఓ అధికారి ట్రంప్‌పై నిఘా పెట్టాలని చెప్పినట్లు కోర్టు చెప్పింది. మాన్‌హాటన్‌లోని కోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ కేసు విషయంలో ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
ప్రధాన సూత్రధారి
ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి ఫర్జాద్ షాకేరీ అని కోర్టు పేర్కొంది. ఇరాన్‌లో ఉన్న షకేరీని 51 ఏళ్ల పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ఏజెంట్‌గా యూఎస్ న్యాయ శాఖ అభివర్ణించింది. అతను చిన్నతనంలో యూఎస్‌కి వచ్చి దోపిడి ఆరోపణలు ఎదుర్కొని 2008లో బహిష్కరించబడ్డాడు. షాకేరీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఇరాన్‌లో ఉన్నట్లు భావిస్తున్నట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. షాకేరీ ఇద్దరు న్యూయార్క్ నివాసితులైన కార్లిస్లే రివెరా, జోనాథన్ లోడ్‌హోల్ట్‌లను కలిశారని, వారిని తన కుట్రలో చేర్చుకుని ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి సిద్ధం చేశారని న్యాయ శాఖ వెల్లడించింది. వీరిద్దరిని అధికారులు అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అందుకే ప్లాన్ వేశారా..
ఇరాన్‌కు చెందిన పలువురు ట్రంప్ ప్రచార సహచరులకు చెందిన ఇమెయిల్‌లను హ్యాక్ చేసి ఆపరేషన్ నిర్వహించారని కోర్టు తెలిపింది. ఇది అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నమని అధికారులు అంచనా వేశారు. ట్రంప్ మళ్లీ ఎన్నికవడాన్ని ఇరాన్ వ్యతిరేకించడం వల్ల వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ట్రంప్ పరిపాలనలో ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ముగించింది. దీంతోపాటు ఆంక్షలను మళ్లీ విధించింది. ఇరాన్ జనరల్ ఖాస్సేమ్ సులేమాని హత్యకు ఆదేశించింది. ఈ చర్యలతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేలా చేసిందని అంటున్నారు. డెమొక్రాట్ కమలా హారిస్‌ను ట్రంప్ ఓడించిన కొద్ది రోజులకే ఈ కుట్ర బహిర్గతం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గతంలో కేసు విచారణ
మరోవైపు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్న కేసును విచారిస్తున్న న్యాయమూర్తి శుక్రవారం విచారణ గడువును రద్దు చేశారు. సిట్టింగ్ అధ్యక్షులను ప్రాసిక్యూట్ చేయలేమని తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ కేసులో "కొనసాగడానికి తగిన చర్య"ని అంచనా వేయడానికి తమకు సమయం కావాలని ప్రాసిక్యూటర్లు ఈ వారం కోర్టుకు తెలిపారు. గత సంవత్సరం ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారని, ఆయన మార్ ఎ లాగో ఎస్టేట్‌లో రహస్య పత్రాలను అక్రమంగా నిల్వ చేశారని ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ ఆరోపించారు.
ప్రాసిక్యూట్ చేయడంపై
ఏది ఏమైనప్పటికీ సిట్టింగ్ ప్రెసిడెంట్‌లను ప్రాసిక్యూట్ చేయడం సాధ్యం కాదని దీర్ఘకాలిక న్యాయ శాఖ విధానం ప్రకారం స్మిత్ బృందం ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు రెండు ఫెడరల్ కేసులను ఎలా ముగించాలో విశ్లేషిస్తోంది. ఇంకోవైపు ఇటివల ఫలితాల్లో ట్రంప్‌నకు 301 ఎలక్టోరల్ ఓట్లు రాగా, హారిస్‌కు 226 ఓట్లు వచ్చాయి. దీంతో కొత్త అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది విజయానికి అవసరమైన 270 ఓట్ల కంటే చాలా ఎక్కువ. గత ఎన్నికల్లో డెమొక్రాటిక్‌కు ఓటు వేసిన కీలక రాష్ట్రాలైన జార్జియా, పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్‌లతో సహా 50 రాష్ట్రాలలో సగానికి పైగా ట్రంప్‌ను విజేతగా ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి:
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More International News and Latest Telugu News
Updated Date - Nov 09 , 2024 | 07:39 AM