Share News

Conflict: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:23 AM

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ బలగాలు మరో అడుగు ముందుకేసి రష్యా భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి.

Conflict: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు

మాస్కో, ఆగస్టు 8: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ బలగాలు మరో అడుగు ముందుకేసి రష్యా భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. దీంతో ఇరు దేశాల బలగాల మధ్య పోరు తీవ్రంగా సాగుతోందని తెలుస్తోంది. సరిహద్దును దాటి ఉక్రెయిన్‌ బలగాలు దాడులను సాగిస్తున్నందున కుర్‌స్క్‌ ప్రాంతంలో అత్యవసర స్థితిని ప్రకటించినట్టు ఆ ప్రాంత గవర్నర్‌ అలెక్సీ స్మిర్నోవ్‌ తెలిపారు.


శత్రు సైనికులను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఉక్రెయిన్‌ బలగాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఐదుగురు పౌరులు మరణించారని, 31 మందికి గాయాలు కాగా వారిలో ఆరుగురు పిల్లలున్నారని రష్యా అధికారులు తెలిపారు. కాగా దీనిపై ఉక్రెయిన్‌ అధికారికంగా ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.

Updated Date - Aug 09 , 2024 | 05:23 AM