ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

US President Election Results: అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి నేపథ్యం ఇదే

ABN, Publish Date - Nov 06 , 2024 | 03:38 PM

అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, జేడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. ఈ జేడీ వాన్స్ మన ఆంధ్ర అల్లుడు కావడం విశేషం.

Usha Chilukuri

Usha Chilukuri: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, జేడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. ఈ జేడీ వాన్స్ మన ఆంధ్ర అల్లుడు. అతడి భార్య పేరు ఉషా చిలుకూరి. ఆమె అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది. ఉషా స్వస్థలం ఏపీకి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద వడ్లూరు అనే చిన్న గ్రామం. ఎన్నో ఏళ్ల క్రితం ఏపీ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు.


ప్రేమ వివాహం..

ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో చదువుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ చదివారు. చదువుకునే సమయంలోనే సుప్రీం కోర్టు అడ్వకేసీ క్లినిక్ అనే కోర్సులో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్ పై పనిచేశారు. ఉషా చిలుకూరి జేడీ వాన్స్ ను తొలిసారిగా 2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో కలిశారు. 'సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా' అనే సబ్జెట్ పై జరిగిన గ్రూప్ డిస్కషన్ లో ఉషా, వాన్స్ లు పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఉషా, జేడీ హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. కుమార్తె మిరాబెల్, కుమారులు ఇవాన్, వివేక్.


50 సంవత్సరాల క్రితం..

ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో అమెరికా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జెడి వాన్స్ విజయం కోసం ఆ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉషా వాన్స్ భర్త గెలవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉషా వాన్స్ వడ్లూరుకు చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణం అంటున్నారు. వారు 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్లారని తెలిపారు. ఆ కుటుంబం గ్రామంలోని వ్యక్తులను విద్యావంతులను చేసిందన్నారు. గతంలో వారు గ్రామానికి భూమిని విరాళంగా ఇచ్చారని, ఆ విరాళంతోనే ఇక్కడ సాయిబాబా, లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవారి బాల సీతా దేవాలయాలు నిర్మించబడ్డాయన్నారు. ఊరి శ్రేయస్సు కోసం, ఉషా వాన్స్ విజయం కోసం తాము ప్రత్యేక ప్రార్థనలు చేసామన్నారు.


Also Read:

అగ్రరాజ్యం అమెరికాను పాలించే అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా

ఫలించిన ట్రంప్ మ్యాజిక్.. రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించనున్న స్టేబుల్ జీనియస్

అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్.. భారత్-యూఎస్ బంధాలు ఎలా ఉంటాయి

For More International News

Updated Date - Nov 06 , 2024 | 03:40 PM