PM Kisaan: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి డబ్బులు
ABN, Publish Date - Oct 05 , 2024 | 07:39 AM
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్ పథకం 18వ విడత నిధులు రూ.20 వేల కోట్లు శనివారం విడుదల కానున్నాయి.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్ పథకం 18వ విడత నిధులు రూ.20 వేల కోట్లు శనివారం విడుదల కానున్నాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి జరగనుంది. వారి ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులు జమకానున్నాయి. నమో శేట్కారీ మహాసన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో రూ.రెండు వేల కోట్లు పొందనున్నారు. పీఎం-కిసాన్ కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు ఇప్పటి వరకూ రూ.3.45 లక్షల కోట్లను సహాయంగా పొందారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి 6 వేల రూపాయలను కేంద్రం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేస్తోంది. ఇవి పంట పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతున్నాయి.
డీబీటీ ద్వారా నగదు బదిలీ..
రైతులు ప్రత్యక్ష బదిలీ (డీబీటీ) ద్వారా రూ. 20 వేల కోట్లకు పైగా ప్రయోజనాలను పొందుతారు.18వ విడత నిధులను మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద జూన్ 18న తొమ్మిది కోట్ల మూడు లక్షల మంది రైతుల ఖాతాలకు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు రూ.20 వేల కోట్లను జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెలిపారు.
Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..
For Latest news and National News click here
Updated Date - Oct 05 , 2024 | 07:39 AM