ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: పీఓకే మనదే, వెనక్కి తెస్తాం: అమిత్‌షా

ABN, Publish Date - May 15 , 2024 | 02:56 PM

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారతదేశం సార్వభౌమాధికారాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. పీఓకే ఇండియాకు చెందినదని, దానిని వెనక్కి తెచ్చుకుంటామని అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని సెరంపోర్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో విపక్షాల తీరును ఆయన ఎండగట్టారు.

కోల్‌కతా: పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారతదేశం సార్వభౌమాధికారాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. పీఓకే ఇండియాకు చెందినదని, దానిని వెనక్కి తెచ్చుకుంటామని అన్నారు. పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని సెరంపోర్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో విపక్షాల తీరును ఆయన ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లో గతంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటానికి వారే కారణమని అన్నారు. మోదీ నాయకత్వంలో కశ్మీర్‌లో వచ్చిన గణనీయమైన మార్పులను కొనియాడారు.


కశ్మీర్‌లో ఒకప్పుడు నిత్యం ఆజాదీ నినాదాలు, రాళ్లు రువ్వుకోవడం ఉండేవని, ఇప్పుడు అవన్నీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ''రాహుల్ బాబా, మమతా దీదీకి భయం ఉంటే, భయపడనీయండి. పీఓకే మాత్రం ఇండియాదే. దానిని వెనక్కి తెచ్చుకుంటా'' అని అమిత్‌షా నొక్కిచెప్పారు.

PM Narendra Modi: నేనలా అనలేదు.. హిందూ-ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ


అయ్యర్ అణుబాంబు..

మణి శంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు పాకిస్థాన్-పీఓకేపై చర్చలను నిర్లక్ష్యం చేస్తూ పాక్ వద్ద అణుబాంబు ఉందంటూ హైలైట్ చేయడం వెనక దేశప్రజల్లో భయం సృష్టించే ప్రయత్నమే ఉందని అమిత్‌షా తప్పుపుట్టారు. 2.11 కోట్ల టూరిస్టులు కాశ్మీర్ వచ్చి సరికొత్త రికార్డు సృష్టిస్తే, పీఓకేలో రొట్టెల పిండి ధర రికార్డు సృష్టిస్తోందన్నారు. ప్రతి పేదవానికి మోదీ ప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. మమతా బెనర్జీ మాత్రం బియ్యం పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం బియ్యం పంపుతుంటే మమతా బెనర్జీ దానిపైన తన ఫోటోని ప్రదర్శిస్తూ, సంక్షేమాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. 'మా, మాటి, మనుష్' అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన దీదీ ఇప్పుడు ఆ నినాదాన్ని 'ముల్లా, మౌల్వి, మదరసా'గా మార్చారని ఎద్దేవా చేశారు. దుర్గా నిమజ్జనానికి ఆమె అనుమతి నిరాకరించి, రంజాన్ పండుగకు మాత్రం ముస్లింలకు సెలవులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు.పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లోనూ జరుగుతుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Latest National News and Telugu News

Updated Date - May 15 , 2024 | 03:01 PM

Advertising
Advertising